టీఆర్ఎస్ పొత్తుపై తేల్చి చెప్పిన ఎంఐఎం అధినేత… చాలా చోట్ల కారుతోనే ఫైట్ అంటున్న ఒవైసీ

గ్రేట్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు లేదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తేల్చి చెప్పారు. పాత బస్తీలోని చాలా ప్రాంతాల్లో ఆయన పాద యాత్ర నిర్వహించారు. ఆ సందర్భంగా మీడియాతో ఒవైసీ మాట్లాడారు. చాలా చోట్ల టీఆర్ఎస్ పార్టీ తమకు పోటీ అని పేర్కొన్నారు.

టీఆర్ఎస్ పొత్తుపై తేల్చి చెప్పిన ఎంఐఎం అధినేత... చాలా చోట్ల కారుతోనే ఫైట్ అంటున్న ఒవైసీ
Follow us

|

Updated on: Nov 22, 2020 | 3:56 PM

MIM Alliance : గ్రేట్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు లేదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తేల్చి చెప్పారు. పాత బస్తీలోని చాలా ప్రాంతాల్లో ఆయన పాద యాత్ర నిర్వహించారు. ఆ సందర్భంగా మీడియాతో ఒవైసీ మాట్లాడారు. చాలా చోట్ల టీఆర్ఎస్ పార్టీ తమకు పోటీ అని పేర్కొన్నారు. మొత్తం 52 స్థానాల్లో పోటీ చేస్తున్నామని పేర్కొన్నారు. డివిజన్లలో ఎంఐఎం పార్టీ చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందని అన్నారు.

హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున వరద వస్తే కేంద్రం ఎటువంటి సాహాయం చేయలేదని ఆయన విమర్శించారు. బీజేపీ హిందూత్వాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. బిజెపి పార్టీ చేస్తున్న రాజకీయం సరైంది కాదని హితవు పలికారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ముస్లింలకు లేదా అంటూ ఆయన అని అసదుద్దీన్ పశ్నించారు.

గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 150 సీట్లకు గాను టీఆర్‌ఎస్‌ 99, ఎంఐఎం 40 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయా, లేక విడివిడిగా పోటీ చేస్తాయా అన్న మీమాంసకు ఎంఐఎం అధినేత ఒవైసీ తెరదించారు.