సోషల్ మీడియాలో ఎంటరైన చిరు.. తొలి ట్వీట్ ఇదే..!

నూతన సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని మెగాస్టార్ చిరు.. సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యారు. బుధవారం ఉదయం..11 గంటల 11 నిమిషాలకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ను ప్రారంభించారు. తన తొలి ట్వీట్‌లోనే.. ఈ సోషల్ మీడియాలోకి ఎందుకు ఎంటర్‌ అయ్యారో చెప్పేశారు. తెలుగు ప్రజలందరికీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. చిరు తన ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించిన క్షణాల్లోనే వేల సంఖ్యలో అభిమానులు ఫాలోఅవ్వడం ప్రారంభించారు. కేవలం గంటలోనే యాభై వేలకు దిశగా ఫాలోవర్స్ అయ్యారు. […]

సోషల్ మీడియాలో ఎంటరైన చిరు.. తొలి ట్వీట్ ఇదే..!
Follow us

| Edited By:

Updated on: Mar 25, 2020 | 12:40 PM

నూతన సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని మెగాస్టార్ చిరు.. సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యారు. బుధవారం ఉదయం..11 గంటల 11 నిమిషాలకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ను ప్రారంభించారు. తన తొలి ట్వీట్‌లోనే.. ఈ సోషల్ మీడియాలోకి ఎందుకు ఎంటర్‌ అయ్యారో చెప్పేశారు. తెలుగు ప్రజలందరికీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. చిరు తన ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించిన క్షణాల్లోనే వేల సంఖ్యలో అభిమానులు ఫాలోఅవ్వడం ప్రారంభించారు. కేవలం గంటలోనే యాభై వేలకు దిశగా ఫాలోవర్స్ అయ్యారు. ఈ సాయంత్రానికి లక్షల్లో ఫాలోవర్స్ పెరిగే అవకాశం ఉంది. తన తొలి ట్వీట్ అనంతరం ప్రధాని మోదీ మంగళవారం ఇచ్చిన 21 రోజుల లాక్ డౌన్ ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు.

తోలి ట్వీట్‌లో ఏమన్నారంటే..

‘‘అంద‌రికీ శార్వ‌రి నామ ఉగాది శుభాకాంక్ష‌లు. నా తోటి భార‌తీయులంద‌రితో, తెలుగు ప్ర‌జ‌ల‌తో, నాకు అత్యంత ప్రియ‌మైన అభిమానులంద‌రితో నేరుగా ఈ వేదిక నుంచి మాట్లాడ‌గ‌ల‌గ‌టం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సంవ‌త్స‌రాది రోజు ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న కోరోనా మ‌హ‌మ్మారిని క‌లిసి క‌ట్టుఆ జ‌యించ‌డానికి కంక‌ణం క‌ట్టుకుందాం. ఇంటి ప‌ట్టునే ఉందాం. సుర‌క్షితంగా ఉందాం’’ అంటూ ట్వీట్ చేవారు.

ఇక రెండో ట్వీట్‌లో..

`21 రోజులు మనందరినీ ఇళ్లలోనే ఉండమని మన భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం కరోనా మహమ్మారిని ఎదర్కోవటానికి ఓ అనివార్యమైన చర్య. ఈ క్లిష్ట సమయంలో మనం, మన కుటుంబాలు, మన దేశం సురక్షితంగా ఉండటానికి మన ప్రియ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, మన ప్రియ ముఖ్యమంత్రులు శ్రీ కేసీఆర్ గారు, శ్రీ జగన్ గారు ఇచ్చే ఆదేశాలను పాటిద్దాం. ఇంటు పట్టునే ఉందాం. సురక్షితంగా ఉందామ`ని రెండో ట్వీట్ చేశారు.

#HappySarvariUgadi DELIGHTED to directly engage with my beloved fellow Indians,Telugus & my dearest fans through a platform like this.This #NewYear’s Day,let’s resolve to defeat this global health crisis with awareness & responsibility. #UnitedAgainstCorona #StayHomeStaySafe pic.twitter.com/Fb3Cnw4nHH

— Chiranjeevi Konidela (@KChiruTweets) March 25, 2020

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు