ఉసురు తీసిన బాక్సింగ్! ఫస్ట్ టైం ఓడిపోయి..ప్రాణాలు విడిచాడు!

మాస్కో: అతడో పేరుమోసిన బాక్సర్. తక్కువ వయసులోనే..బరిలోకి దిగిన తక్కువ మ్యాచుల్లోనే తన సత్తా ప్రపంచానికి చాటాడు. అతడి పేరే డడ్‌షెవ్‌. ఇప్పటివరకు అతను తలపడిన గత 13 బౌట్లలో అజేయంగా నిలిచాడంటేనే అతడి స్థాయేంటో తెలిసిపోతుంది. కానీ ఆ యువ బాక్సర్ రింగ్‌లోనే ప్రాణాలు విడవడంతోనే  విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… మేరీలాండ్‌ పరిధి అక్సన్‌ హిల్‌లో గత శుక్రవారం రాత్రి మాక్సిమ్‌ డడ్‌షెవ్‌ (రష్యా), సుబ్రియెల్‌ మటియాస్‌ […]

ఉసురు తీసిన బాక్సింగ్! ఫస్ట్ టైం ఓడిపోయి..ప్రాణాలు విడిచాడు!
Follow us

|

Updated on: Jul 25, 2019 | 6:14 AM

మాస్కో: అతడో పేరుమోసిన బాక్సర్. తక్కువ వయసులోనే..బరిలోకి దిగిన తక్కువ మ్యాచుల్లోనే తన సత్తా ప్రపంచానికి చాటాడు. అతడి పేరే డడ్‌షెవ్‌. ఇప్పటివరకు అతను తలపడిన గత 13 బౌట్లలో అజేయంగా నిలిచాడంటేనే అతడి స్థాయేంటో తెలిసిపోతుంది. కానీ ఆ యువ బాక్సర్ రింగ్‌లోనే ప్రాణాలు విడవడంతోనే  విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే… మేరీలాండ్‌ పరిధి అక్సన్‌ హిల్‌లో గత శుక్రవారం రాత్రి మాక్సిమ్‌ డడ్‌షెవ్‌ (రష్యా), సుబ్రియెల్‌ మటియాస్‌ (ప్యూర్టోరికో) మధ్య ప్రపంచ బాక్సింగ్‌ సమాఖ్య (ఐబీఎఫ్‌) సూపర్‌ లైట్‌ వెయిట్‌ విభాగంలో బౌట్‌ జరిగింది. ఇందులో మటియాస్‌ వరుసగా విసిరిన పంచ్‌ల ధాటికి 28 ఏళ్ల డడ్‌షెవ్‌ కప్పకూలిపోయాడు. హుటాహుటిన అతడిని వాషింగ్టన్‌లోని ఆస్పత్రిలో చేర్చారు. మెదడులోని నరాలు చిట్లి అంతర్గతంగా తీవ్ర రక్తస్రావం కావడంతో చిక్సిత పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మరోవైపు రష్యా బాక్సింగ్‌ సమాఖ్య ఈ బౌట్‌పై విచారణ జరుపుతోంది. ఈ బౌట్‌లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఉమర్‌ క్రెమ్లెవ్‌ ఆరోపించాడు. డడ్‌షెవ్‌కు భార్య, కుమారుడు ఉన్నారు.