“రోజు గొడవలు, 8 కేసులు.. అందుకే చంపేశా”.. మణిక్రాంతి కేసులో నిందితుడు

తెలుగురాష్ట్రాల్లో సంచలనం  సృష్టించిన విజయవాడ మణిక్రాంతి దారుణ హత్య కేసులో పలు విషయాలు వెల్లడించారు పోలీసులు.  శుక్రవారం సాయంత్రం నిందితుడు ప్రదీప్‌కుమార్, అతనికి సహకరించిన కారు డ్రైవర్ భవానీప్రసాద్‌ను మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా డీసీపీ విజయారావు మాట్లాడుతూ భార్యభర్తల మధ్య రోజు జరిగే గొడవలే ఈ హత్యకు కారణమన్నారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామానికి చెందిన ప్రదీప్‌కుమార్( 25), విజయవాడ శ్రీనగర్ కాలనీకి చెందిన మణిక్రాంతి ఇద్దరూ 2015లో ప్రేమించి పెళ్లి […]

రోజు గొడవలు, 8 కేసులు.. అందుకే చంపేశా.. మణిక్రాంతి కేసులో నిందితుడు
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2019 | 1:06 PM

తెలుగురాష్ట్రాల్లో సంచలనం  సృష్టించిన విజయవాడ మణిక్రాంతి దారుణ హత్య కేసులో పలు విషయాలు వెల్లడించారు పోలీసులు.  శుక్రవారం సాయంత్రం నిందితుడు ప్రదీప్‌కుమార్, అతనికి సహకరించిన కారు డ్రైవర్ భవానీప్రసాద్‌ను మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా డీసీపీ విజయారావు మాట్లాడుతూ భార్యభర్తల మధ్య రోజు జరిగే గొడవలే ఈ హత్యకు కారణమన్నారు.

కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామానికి చెందిన ప్రదీప్‌కుమార్( 25), విజయవాడ శ్రీనగర్ కాలనీకి చెందిన మణిక్రాంతి ఇద్దరూ 2015లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరద్దరూ ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేసేవారు. రెండేళ్ల ఇద్దరి మధ్య కలహాలు మొదలయ్యాయి. దీంతో ఇద్దరూ వేర్వేరుగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు.

మణిక్రాంతి.. తన భర్త ప్రదీప్‌ మీద సత్యనారాయణపురం పోలీస్‌ స్టేషన్‌లో 4, సూర్యారావుపేటలో 3, మాచవరంలో ఒక కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో సూర్యారావుపేటలో పెట్టిన కేసు విషయంలో ప్రదీప్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆగస్టు 7న బెయిల్‌మీద విడుదలయ్యాడు.   ఈ పరిస్థితిలో భార్య అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న ప్రదీప్.. శ్రీనగర్‌కాలనీలో రెక్కీ నిర్వహించి 11 వతేదీన షాపింగ్ నుంచి ఇంటికి వస్తుండగా కత్తితో తలనరికి హత్య చేశాడు. తలను ఏలూరు కాలువలో పడేసి పోలీసులకు లొంగిపోయాడు. ఇంట్లో రోజు గొడవలు, విజయవాడలో మొత్తం మూడు పోలీస్ స్టేషన్లలో 8 కేసులు.. అందుకే విసిగిపోయి ఇలా చంపాల్సి వచ్చిందంటూ మృతురాలి భర్త, నిందితుడు ప్రదీప్‌కుమార్ పోలీసులు ఎదుట చెప్పాడు.

ఈ కేసులో నిందితుడు ప్రదీప్‌కుమార్‌కు సహకరించిన అతని స్నేహితుడు కారు డ్రైవర్ గరికపాటి భవానీప్రసాద్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఇప్పటికీ మణిక్రాంతి తల దొరకలేదని, అయినప్పటకి బ్లడ్ శాంపిల్స్, డీఎన్ఏ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు డీసీపీ చెప్పారు.