ఈ ఒక్క మ్యాచ్ వదిలేయ్..వరుణదేవా!

ప్రతి నాలుగేళ్లకొకసారి వచ్చే వరల్డ్ కప్ కోసం సగటు క్రికెట్ అభిమాని ఎంతగానో ఎదురుచూస్తుంటాడు. అందునా భారత్-పాక్ మ్యాచ్ అంటే ఆ కిక్ వేరు. ప్రతి కంట్రీలోనూ క్రికెట్‌ను ఇష్టపడేవాళ్లు ఈ మ్యాచ్‌పై స్పెషల్ ఇంట్రస్ట్ చూపిస్తూ ఉంటారు. మరీ పిచ్చి ఉన్నవాళ్లు లైవ్ మ్యాచ్ చూడటం కోసం ఎంత ఖర్చు పెట్టైనా టికెట్లు కొంటారు. మరికొందరూ ఇంపార్టెంట్ పనులు కూడా వాయిదా వేసుకొని టీవీలకు అతుక్కుపోతారు. ఏది ఏమైనా భారత్-పాక్ మ్యాచ్ అంటే ఓ మినీ […]

ఈ ఒక్క మ్యాచ్ వదిలేయ్..వరుణదేవా!
Follow us

|

Updated on: Jun 16, 2019 | 11:24 AM

ప్రతి నాలుగేళ్లకొకసారి వచ్చే వరల్డ్ కప్ కోసం సగటు క్రికెట్ అభిమాని ఎంతగానో ఎదురుచూస్తుంటాడు. అందునా భారత్-పాక్ మ్యాచ్ అంటే ఆ కిక్ వేరు. ప్రతి కంట్రీలోనూ క్రికెట్‌ను ఇష్టపడేవాళ్లు ఈ మ్యాచ్‌పై స్పెషల్ ఇంట్రస్ట్ చూపిస్తూ ఉంటారు. మరీ పిచ్చి ఉన్నవాళ్లు లైవ్ మ్యాచ్ చూడటం కోసం ఎంత ఖర్చు పెట్టైనా టికెట్లు కొంటారు. మరికొందరూ ఇంపార్టెంట్ పనులు కూడా వాయిదా వేసుకొని టీవీలకు అతుక్కుపోతారు. ఏది ఏమైనా భారత్-పాక్ మ్యాచ్ అంటే ఓ మినీ యుద్దమే.

తాజాగా వరల్డ్ కప్ 2019లో భాగంగా ఈరోజు ఈ రెండు జట్లు తలపడనున్నాయి. మరికొద్ది గంటల్లోనే క్రికెట్‌ ప్రపంచమంతా కళ్లప్పగించి చూస్తున్న మహా సంగ్రామం ప్రారంభం కానుంది. గత కొన్ని నెలల్లో ఇరు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో గెలుపు ఇరు దేశాల అభిమానులకూ ప్రతిష్టాత్మకంగా మారింది. పాక్‌ ఎంతో దూకుడుగా ఉన్న రోజుల్లోనూ ప్రపంచకప్‌లో ఆ జట్టుకు తలవంచని భారత్‌‌కు.. ప్రస్తుత పాక్‌ టీంతో పోలిస్తే భారత్‌కు విజయవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌ ఓడితే పాక్‌ సెమీస్‌ అవకాశాలు కష్టంగా మారుతాయి. కాబట్టి ఆ జట్టు అంత తేలిగ్గా మ్యాచ్‌ను వదిలే అవకాశం లేదు. మరోవైపు ఈ మ్యాచ్‌కు అన్నింటికి పెద్ద గండం వరుణుడు. వర్షం ఎఫెక్ట్ వల్ల ఓవర్లను కుదించే అవకాశాలు కూడా ఉన్నాయని స్పోర్ట్స్ ఎనలిస్టులు అభిప్రాయ పడుతున్నారు.

ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే ఏకంగా నాలుగు మ్యాచ్‌లు వర్షార్పణం అయ్యాయి. దీంతో క్రికెట్ అభిమానులకు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాంచెస్టర్‌లో జరిగే ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ చెప్తున్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ప్రపంచకప్‌కే ఆకర్షణ అయిన ఈ మ్యాచ్‌ కూడా రద్దయితే టోర్నీ కళ తప్పడం ఖాయం. అందుకే ఈ మ్యాచ్‌ జరగాలని ఐసీసీ సైతం ఎంతగానో కోరుకుంటోంది. ఈ మ్యాచ్ జరగకపోతే.. ఐసీసీకి భారీ నష్టం కూడా వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు క్రికెట్ అభిమానులు సైతం వరుణుడికి పూజలు చేస్తున్నారు. ఈ ఒక్క మ్యాచ్‌ను వదిలేయవా వరుణదేవుడా! అంటూ ప్రార్థిస్తున్నారు. ఇదే సమయంలో వరల్డ్ కప్ షెడ్యూల్‌ను నిర్ణయించిన ఐసీసీని శాపనార్థాలు పెడుతున్నారు.

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!