పరీక్ష చేయకుండానే కరోనా పాజిటివ్‌.. యువకుడి ఆందోళన

కరోనా పరీక్ష నిర్వహించకుండానే పాజిటివ్‌ వచ్చినట్లు తనకు సందేశం‌ పంపారని ఓ యువకుడు(28) అధికారులకు ఫిర్యాదు చేశాడు.

పరీక్ష చేయకుండానే కరోనా పాజిటివ్‌.. యువకుడి ఆందోళన
Follow us

| Edited By:

Updated on: Jun 29, 2020 | 4:53 PM

కరోనా పరీక్ష నిర్వహించకుండానే పాజిటివ్‌ వచ్చినట్లు తనకు సందేశం‌ పంపారని ఓ యువకుడు(28) అధికారులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలంలోని జి.కొత్తూరుకు చెందిన ఓ యువకుడు జ్వరంగా ఉండటంతో ఈ నెల 25న కరోనా పరీక్షల కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రి(జీజీహెచ్)కి వెళ్లాడు. అయితే అక్కడి సిబ్బంది అతడి వివరాలను నమోదు చేసుకొని పరీక్ష ఎప్పుడు చేస్తామో ఫోన్‌ చేసి చెబుతామని అన్నారు. దీంతో ఆ యువకుడు వెనక్కి వచ్చేశాడు.

అయితే ఈ లోపే తనకు పాజిటివ్ వచ్చినట్లు శనివారం పీహెచ్‌సీ సిబ్బంది ఇంటికి వచ్చి చెప్పడంతో తీవ్ర అయోమయానికి గురైన ఆ యువకుడు .. దీనిపై వేట్లపాలెం పీహెచ్‌సీ వైద్యాధికారిణి ధనలక్ష్మికి ఫిర్యాదు చేశాడు. ఆమె ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ఎం.రాఘవేంద్రరావు దృష్టికి తీసుకెళ్లగా.. ఫిర్యాదుపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు.