‘డిఫెన్స్‌ పార్లమెంటరీ ప్యానెల్‌”లోకి .. వివాదాస్ప‌ద ఎంపీ ఎంటర్..

బీజేపీ ఎంపీ, సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్.. ఈ పేరు వింటే చాలు.. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. అలాంటి ఆమెకు.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ రంగ పార్లమెంటరీ కమిటీ ప్యానెల్‌లో చోటుదక్కింది. ఈ కమిటీలో మొత్తం 21 మంది ఎంపీలు ఉన్నారు. అందులో ప్రజ్ఞా ఠాకూర్‌తో పాటుగా ఫారూక్ అబ్దుల్లా, సౌగ‌త్ రాయ్‌, ఏ రాజా, శ‌ర‌ద్ ప‌వార్‌లు కూడా ఉన్నారు. అయితే ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు ఈ […]

‘డిఫెన్స్‌ పార్లమెంటరీ ప్యానెల్‌లోకి .. వివాదాస్ప‌ద ఎంపీ ఎంటర్..
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 22, 2019 | 3:45 PM

బీజేపీ ఎంపీ, సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్.. ఈ పేరు వింటే చాలు.. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. అలాంటి ఆమెకు.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ రంగ పార్లమెంటరీ కమిటీ ప్యానెల్‌లో చోటుదక్కింది. ఈ కమిటీలో మొత్తం 21 మంది ఎంపీలు ఉన్నారు. అందులో ప్రజ్ఞా ఠాకూర్‌తో పాటుగా ఫారూక్ అబ్దుల్లా, సౌగ‌త్ రాయ్‌, ఏ రాజా, శ‌ర‌ద్ ప‌వార్‌లు కూడా ఉన్నారు. అయితే ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు ఈ కమిటీలో చోటు కల్పించడంపై కాంగ్రెస్ భగ్గుమంది. బీజేపీ రక్షణ రంగాన్ని అవమానించారంటూ ఆరోపించింది. మాలేగావ్ బ్లాస్ట్ కేసులో నిందితురాలిగా ఉన్న ఆమెను రక్షణ కమిటీలోకి ఎలా స‌భ్యురాలిగా చేశార‌ంటూ.. కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తోంది.

కాగా, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో.. సాధ్వీ ప్రజ్ఞా సింగ్.. గాంధీని హత్యచేసిన గాడ్సేపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గాడ్సే ఓ గొప్ప దేశభక్తుడంటూ సరికొత్త వివాదానికి తెరలేపింది. ప్రస్తుతం ఆమె మధ్యప్రదేశ్ భోపాల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.