ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యల నేపథ్యం, మహారాష్ట్ర, కర్నాటక మధ్య ముదిరిన అంతర్ రాష్ట్ర సరిహద్దు వివాదం

మహారాష్ట్ర, కర్నాటక మధ్య అంతర్ రాష్ట్ర సరిహద్దు వివాదం మెల్లగా ముదురుతోంది. ఎప్పుడో 1956 నాటి స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ మళ్ళీ తెరపైకి..

ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యల నేపథ్యం, మహారాష్ట్ర, కర్నాటక మధ్య ముదిరిన అంతర్ రాష్ట్ర సరిహద్దు వివాదం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 28, 2021 | 1:51 PM

మహారాష్ట్ర, కర్నాటక మధ్య అంతర్ రాష్ట్ర సరిహద్దు వివాదం మెల్లగా ముదురుతోంది. ఎప్పుడో 1956 నాటి స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ మళ్ళీ తెరపైకి వచ్చింది.ఈ కేసు సుప్రీంకోర్టులో ఏళ్ళ తరబడి నలుగుతోంది. కర్నాటకలో మరాఠాలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాలను మహారాష్ట్రలో విలీనం చేయాలంటూ ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే ఇటీవల పబ్లిక్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు చిచ్ఛు రేపాయి. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలు పరిష్కారమయ్యేవరకు ఎటూ తేలకుండా ఉన్న ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతంగా మలచాలని ఆయన సూచించారు. దీనిపై కర్నాటక డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సావడి తీవ్రంగా స్పందించారు. తమ కర్నాటకలో ముంబైని చేర్చాలని లేదా దాన్ని  ఫెడరల్ గవర్నెన్స్ ప్రావిన్స్ గా మార్చాలని ఆయన సూచించారు. ఉద్దవ్ థాక్రే వ్యాఖ్యలను మేం ఖండిస్తున్నాం..సుప్రీంకోర్టులో తీర్పు మాకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నాం అన్నారు. ముంబై కర్నాటకలో భాగమని తమ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని, అందువల్ల ముంబై  నగరంపై తమకు కూడా హక్కు ఉందని ఆయన చెప్పారు. ఈ నగరాన్ని మా రాష్ట్రంలో భాగంగా చేర్చేంతవరకు దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని  తాము కేంద్రాన్ని కోరుతున్నామన్నారు.

1967 నాటి మహాజన్ కమిషన్ రిపోర్టును మేము స్వాగతిస్తుండగా.. మహారాష్ట్ర తిరస్కరిస్తోందని, కానీ అదే ఫైనల్ అని ఆయన పేర్కొన్నారు. ఇలా ఉండగా మహారాష్ట్ర సీఎం థాక్రే నిన్న తమ మంత్రివర్గ సహచరులతోను . ఎన్సీపీ నేత శరద్ పవార్ తోను సమావేశమై.. బెల్గాం జిల్లాను ‘బెళగావి’ గా మార్చడం ద్వారా కర్ణాటక ప్రభుత్వం ఈ జిల్లాపై పెత్తనం సాధించ జూస్తోందని, అసలు ఈ వివాదం ఇంకా కోర్టులోనే ఉందని ఆయన అన్నారు. ఈ డిస్ట్రిక్ట్ మహారాష్ట్రలో భాగమని ఆయన వ్యాఖ్యానించారు.