Breaking News
  • ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించిన సర్వే ఆఫ్‌ ఇండియా. జమ్ము-కశ్మీర్‌ విభజన తర్వాత విడుదల చేసిన కొత్త మ్యాప్‌లో ఏపీ రాజధానిగా ఏ నగరాన్ని చూపని సర్వే ఆఫ్‌ ఇండియా. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన పత్రాల ఆధారంగా అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ కొత్తమ్యాప్‌ విడుదల చేసిన సర్వేఆఫ్‌ ఇండియా.
  • యాదాద్రి: బైక్‌ను ఢీకొన్న గూడ్స్‌ రైలు. భర్త రాంరెడ్డి మృతి, భార్య రాధకు తీవ్రగాయాలు. భువనగిరి మండలం రాయగిరి రైల్వేస్టేషన్‌ దగ్గర ఘటన.
  • పార్టీ మారతారన్న వార్తలపై స్పందించిన మంత్రి ఈటల. నేను పార్టీ మారను-మంత్రి ఈటల. గాలి వార్తలపై నేను స్పందించను. చెప్పే వాళ్లు ఎన్నైనా చెప్తారు-మంత్రి ఈటల.
  • సుజనాచౌదరి వ్యాఖ్యలకు మంత్రి మోపిదేవి కౌంటర్‌. గోడ దూకే ఎంపీలెవరూ వైసీపీలో లేరు. జగన్‌పై ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంపూర్ణ విశ్వాసం ఉంది. తిరుమలను ఆర్ధిక వనరుగా భావించే ఆలోచన ప్రభుత్వానికి లేదు -మంత్రి మోపిదేవి వెంకటరమణ.
  • ఈ ప్రపంచంలో దేనికైనా రంగులు వేయొచ్చు కష్టానికి తప్ప. అమరావతిని అంతర్జాతీయ పటంలో పెట్టింది చంద్రబాబు. అమరావతిని చేర్చి సర్వే ఆఫ్‌ ఇండియా కొత్త మ్యాప్‌ విడుదల చేసేలా లోక్‌సభలో పోరాడిన గల్లా జయదేవ్‌కు అభినందనలు-ట్విట్టర్‌లో నారా లోకేష్‌

తెలంగాణ రాజకీయాల్లోకి విద్యాసాగర్ రావు రీ ఎంట్రీ.. కారు దూకుడుకు బ్రేక్ పడేనా..?

Maharastra Governor Vidya Sagarrao Targets Cm KCR?, తెలంగాణ రాజకీయాల్లోకి విద్యాసాగర్ రావు రీ ఎంట్రీ.. కారు దూకుడుకు బ్రేక్ పడేనా..?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకి మారుతున్నాయి. తాజాగా నిన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేసి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మరోవైపు తెలంగాణలో కారు జోరుకు బ్రేకులు వేసేందుకు కమలం పార్టీ పావులు కదుపుతోంది. సీఎం కేసీఆర్‌కి ధీటుగా తమ పార్టీ నుంచి సీనియర్ నేతను రంగంలోకి దించే పనిలో పడింది. తెలంగాణలో తన హవా కొనసాగించేందుకు.. బీజేపీ తరపున ఓ బలమైన నేతను తెలంగాణ రాజకీయాల్లోకి ఎంటర్ చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు పదవీకాలం పొడిగించకుండా ఆయన్ను పక్కనపెట్టారని రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.

తెలంగాణలో ఒకప్పుడు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా పనిచేసిన విద్యాసాగర్ రావు.. సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు తగినవాడుగా బీజేపీ నాయకత్వం యోచిస్తోంది. ఉత్తర తెలంగాణలో ఒకప్పడు బలమైన బీజేపీ నేతగా విద్యాసాగర్ రావుకు మంచి క్రేజ్ ఉంది. అందుకే పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు అతడికి అప్పగిస్తే బాగుంటుందని పార్టీలోని కొందరు సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా తెలంగాణలో ఇతర పార్టీ నాయకులను కూడా ఆకర్షించే పనిలో ఉన్న బీజేపీ.. తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకుల సేవలను ఉపయోగించుకునేందుకు సిద్దమైంది. ఈ క్రమంలోనే విద్యాసాగర్ రావుని మరోసారి తెలంగాణ రాజకీయాల్లో దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే టీఆర్ఎస్ మాత్రం ఏం తీసిపోలేదు. ఉద్యమ పార్టీగా అవతరించి తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. టీఆర్ఎస్ జోరుకు ఎదురుతిరిగేందుకు ప్రత్యామ్నాయ పార్టీ లేకుండా పోయింది. ఇక ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీని చిత్తుగా ఓడించింది. దీంతో టీఆర్ఎస్‌కు ఎదురుతిరిగే సత్తా తమకే ఉందని బీజేపీ నేతలు సంబరపడుతున్నారు. అయితే ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్‌కి రెండోసారి కూడా తిరుగులేకుండా పోయింది. ఇతర పార్టీల ఊసు లేకుండా టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారు. కాగా, టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీని తీర్చిదిద్దాలని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు సందర్భాల్లో ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్నారు. అంతేకాదు పలు సమావేశాల్లో కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కమలం జెండా ఎగురుతుందని రాష్ట్ర బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు చెక్ పెట్టాలంటే విద్యాసాగర్ రావుకు తెలంగాణ రాజకీయాల్లో కీలక బాధ్యతలు అప్పగించాలని బీజేపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది.

1980లో విద్యాసాగర్ రావు రాజకీయ ప్రస్తానం మొదలైంది. 1980లో బీజేపీ తరపున కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తరువాత 1985లో మెట్‌పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 1989, 1994లో మరో రెండు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1998లో కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎంపీగా గెలుపొందారు. 1999లో మరోసారి గెలుపొంది వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2004, 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసి కేసీఆర్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత 2009లో వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి తన అన్న కొడుకైన చెన్నమనేని రమేశ్ బాబు చేతిలో ఓడిపోయారు. ఇక అక్కడి నుంచి తెలంగాణ రాజకీయాలకు దూరమైన విద్యాసాగర్ రావు ఆ తర్వాత కాలంలో మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు.

మరోవైపు తెలంగాణ గవర్నర్‌గా తమిళ ఇసై సౌందరరాజన్‌ను రంగంలోకి దింపారు. నెమ్మదిగా బీజేపీకి అనుకూలంగా ఉన్న నేతలను తెలంగాణ రాజకీయాల్లోకి దించుతున్నారని తెలుస్తోంది. ఇక సీఎం కేసీఆర్ కూడా ఏ మాత్రం తగ్గకుండా తనదైన శైలిలో అవకాశం వచ్చిన ప్రతిసారి కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. ఇక విద్యాసాగర్ రావు కేసీఆర్ దూకుడుకు ఏ విధంగా చెక్ పెడతారో చూడాల్సిందేనని రాష్ట్ర బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు.