దారుణ ఘటన.. సాధువులపై మూకదాడి.. ముగ్గురు మృతి..!

ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారితో వణికిపోతుంటే.. మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఈ నెల 16వ తేదీన లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సమయంలో.. రాత్రి సమయంలో ఓ వాహనం ఇద్దరు సాధువలు.. డ్రైవర్‌ అటుగా వెళ్తుండగా.. వాహనంపై దాదాపు వెయ్యి మందికి పైగా దాడికి దిగారు. వాహనంలో ఉన్న ఇద్దరు సాధువులను, డ్రైవర్‌ను బయటకు లాగి.. కర్రలు, రాడ్లు, రాళ్లతో కొట్టి చంపేశారు. అయితే సాధువులు వారి గురువు పరమపదించడంతో.. అంతిమ సంస్కారాలకు హాజరయ్యేందుకు […]

దారుణ ఘటన.. సాధువులపై మూకదాడి.. ముగ్గురు మృతి..!
Follow us

| Edited By:

Updated on: Apr 20, 2020 | 3:50 PM

ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారితో వణికిపోతుంటే.. మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఈ నెల 16వ తేదీన లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సమయంలో.. రాత్రి సమయంలో ఓ వాహనం ఇద్దరు సాధువలు.. డ్రైవర్‌ అటుగా వెళ్తుండగా.. వాహనంపై దాదాపు వెయ్యి మందికి పైగా దాడికి దిగారు. వాహనంలో ఉన్న ఇద్దరు సాధువులను, డ్రైవర్‌ను బయటకు లాగి.. కర్రలు, రాడ్లు, రాళ్లతో కొట్టి చంపేశారు. అయితే సాధువులు వారి గురువు పరమపదించడంతో.. అంతిమ సంస్కారాలకు హాజరయ్యేందుకు వెళ్తున్నారని తెలిసింది.

అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చినా.. అక్కడే ఉండి కూడా ఆ సాధువులను, డ్రైవర్‌ను కాపాడలేకపోయారు. అయితే దొంగలు సంచరిస్తున్నారన్న పుకార్లతోనే ఈ దాడి జరిగిందని పోలీసులు చేతులు దులుపుకున్నారు. అయితే దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఒక్కసారిగా మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టించాయి.

సాధువులపై ఒక వర్గానికి చెందిన వారే కుట్రపూరితంగా దాడికి దిగారని.. పోలీసులు వచ్చాక కూడా.. విచక్షణా రహితంగా సాధువులపై దాడికి పాల్పడటమేంటని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌ అయ్యాయి. దీంతో మహారాష్ట్ర సర్కార్‌ మేల్కొంది. దీంతో పాల్‌ఘర్‌ పోలీసులు ఘటనకు కారకులైన 110 మందిని అరెస్టు చేశారు. వీరిలో 9 మంది మైనర్లు కూడా ఉన్నట్లు తెలిపారు. వారిని జువెనైల్‌ హోమ్‌కు తరలించారు. మిగతా నిందితులందరికీ ఏప్రిల్ 30 వరకూ పోలీసుల కస్టడీలోనే ఉంటారని తెలిపారు. ఈ పుకార్లు ఎవరు సృష్టించారు. లాక్‌డౌన్‌ సమయంలో క్షణాల్లో అంత పెద్ద ఎత్తున ప్రజలు ఎలా గుమికూడారు..? అన్న విషయాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

కాగా.. పాల్‌ఘర్‌లో సాధువులపై జరిగిన దాడిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఉన్నతస్థాయి విచారణ జరిపి దోషులకు కఠిన శిక్షలు విధించాలని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ డిమాండ్ చేశారు. అటు ఇతర రాష్ట్రాల నేతలతో పాటు.. పలు హిందూ సంఘాలు కూడా ఈ ఘటనపై మండిపడుతున్నాయి.

Latest Articles
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్