గన్‌మెన్ హఠాన్మరణం.. కన్నీరుమున్నీరైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

ఎప్పుడూ గంభీరంగా కనిపించే మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్.. ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. తన వద్ద గన్‌మెన్‌గా పనిచేసిన శ్రీనివాస్ అకాల మరణంతో ఆయన ఒక్కసారిగా చలించిపోయారు. గన్‌మెన్ మృతిని తట్టుకోలేని ఎమ్మెల్యే ఒక్కసారిగా బోరున విలపించారు. శ్రీనివాస్ అంత్యక్రియలను పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ గన్‌మెన్ పాడెను మోశారు. అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ విలపించన తీరు స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. గన్‌మెన్ శ్రీనివాస్.. ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు కుడి […]

గన్‌మెన్ హఠాన్మరణం.. కన్నీరుమున్నీరైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 19, 2019 | 1:34 PM

ఎప్పుడూ గంభీరంగా కనిపించే మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్.. ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. తన వద్ద గన్‌మెన్‌గా పనిచేసిన శ్రీనివాస్ అకాల మరణంతో ఆయన ఒక్కసారిగా చలించిపోయారు. గన్‌మెన్ మృతిని తట్టుకోలేని ఎమ్మెల్యే ఒక్కసారిగా బోరున విలపించారు. శ్రీనివాస్ అంత్యక్రియలను పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ గన్‌మెన్ పాడెను మోశారు. అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ విలపించన తీరు స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. గన్‌మెన్ శ్రీనివాస్.. ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు కుడి భుజంలా.. భావించేవారని స్థానికులు చెబుతున్నారు.