అరె ! గాల్లో తేలాడా ? కనుక్కోండి చూద్దాం !

  కాలిఫోర్నియాలోని ఓ మెజీషియన్ చేసిన ‘ అద్భుతాన్ని ‘ చూసి అంతా నోళ్లు వెళ్ళబెట్టారు. జాక్ కింగ్ అనే యువకుడు కాసేపు భూమికి కాస్త ఎత్తులో అలా.. అలా గాల్లో తేలుతూ వావ్ అనిపించాడు. టిక్ టాక్ లో 2.82 మిలియన్ల మంది, యూట్యూబ్ లో 5.14 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్న ఇతగాడు చేసిన పనికి ఆశ్ఛర్యపోనివాళ్ళు లేరు.. హారీ పోటర్ లాగా డ్రెస్సు ధరించి జాక్ గాల్లో ‘ విహరించాడు ‘. ఇతని […]

అరె ! గాల్లో తేలాడా ? కనుక్కోండి చూద్దాం !
Follow us

|

Updated on: Dec 14, 2019 | 6:55 PM

కాలిఫోర్నియాలోని ఓ మెజీషియన్ చేసిన ‘ అద్భుతాన్ని ‘ చూసి అంతా నోళ్లు వెళ్ళబెట్టారు. జాక్ కింగ్ అనే యువకుడు కాసేపు భూమికి కాస్త ఎత్తులో అలా.. అలా గాల్లో తేలుతూ వావ్ అనిపించాడు. టిక్ టాక్ లో 2.82 మిలియన్ల మంది, యూట్యూబ్ లో 5.14 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్న ఇతగాడు చేసిన పనికి ఆశ్ఛర్యపోనివాళ్ళు లేరు.. హారీ పోటర్ లాగా డ్రెస్సు ధరించి జాక్ గాల్లో ‘ విహరించాడు ‘. ఇతని చేతిలో ఓ ‘ మ్యాజిక్ బ్రూమ్ స్టిక్ ‘ మాత్రమే ఉంది. భ్రమలు కల్పించే తన వెరైటీ స్టంట్లతో అలరారించే జాక్ చేసిన ఈ ట్రిక్ అసలు రహస్యం ఒకటుంది.. ఈయనగారు తన బ్రూమ్ స్టిక్ వెనుకభాగం నుంచి వేలాడుతున్న పెద్ద అద్దాన్ని తనతో బాటు తీసుకువెళ్తూ .. తన కాలు ఒకటే కనిపించేలా మేనేజ్ చేశాడు. అంతేనా ? తన కాళ్ళ కింద స్కేటింగ్ చేసే ఓ కార్డ్ బోర్డు అమర్చుకుని దాంతో ముందుకు పరుగు తీస్తూ.. ఆ సీన్ అద్దంలో ప్రతిబింబించే చే ఏర్పాటు చేశాడు.. చూసిన వాళ్లకు ఆయనగారు నిజంగానే గాల్లో తేలియాడాడని అనుకుని అబ్బురపడ్డారు. మరి మెజీషియన్ అంటే మాటలు కాదని నిరూపించాడు.

View this post on Instagram

They rejected my application to Hogwarts but I still found a way to be a wizard.?✨ #illusion #magic #harrypotter

A post shared by Zach King (@zachking) on

Latest Articles