‘లవ్ జిహాద్’ కు వ్యతిరేకంగా చట్టం తెస్తాం, ఎవరైనా కుట్ర పన్నితే తాట తీస్తాం, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్

వివాదాస్పద లవ్ జిహాద్ పై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా నిప్పులు కక్కారు. ఈ పోకడకు కుట్ర పన్నేవారిని నాశనం చేస్తాం అని హెచ్చరించారు. మత మార్పిడుల పేరిట పెళ్లిళ్లు చేసుకునేవారికి పదేళ్ల జైలు శిక్ష విధించేందుకు..

'లవ్ జిహాద్' కు వ్యతిరేకంగా చట్టం తెస్తాం, ఎవరైనా కుట్ర  పన్నితే తాట తీస్తాం, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 03, 2020 | 6:52 PM

వివాదాస్పద లవ్ జిహాద్ పై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా నిప్పులు కక్కారు. ఈ పోకడకు కుట్ర పన్నేవారిని నాశనం చేస్తాం అని హెచ్చరించారు. మత మార్పిడుల పేరిట పెళ్లిళ్లు చేసుకునేవారికి పదేళ్ల జైలు శిక్ష విధించేందుకు ఉద్దేశించిన ముసాయిదా  బిల్లును ప్రభుత్వం రూపొందించిన 10 రోజుల అనంతరం చౌహాన్ గురువారం ఈ ప్రకటన చేశారు. హిందూ మహిళలను పెళ్లి చేసుకుని మతం మారాల్సిందిగా వారిని ఒత్తిడి చేసే ముస్లిములపట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఇలా కుట్ర పన్నేవారి తాట తీస్తాం అని ఆవేశంగా వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం అందరిదీనని, ఇక్కడ అన్నిమతాలు, కులాలవారు నివసిస్తున్నారని పేర్కొన్నారు. వివక్షకు ఇక్కడ తావు లేదు.  కానీ మాకూతుళ్ళను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోబోమని ఆయన అన్నారు.

బలవంతపు మత మార్పిడులను నిషేధించేందుకు మొదట యూపీ ప్రభుత్వం చట్టం తెచ్చిన అనంతరం మధ్యప్రదేశ్ కూడా అదే బాటన నడుస్తోంది. ఇక హర్యానా వంటి రాష్ట్రాలు కూడా  ఈ విధమైన చట్టాలను తెచ్చే యోచనలో ఉన్నాయి.