గూడు కట్టుకుంటున్న బాతుకు బాలుడి సాయం..సోషల్ మీడియాలో వైరలవుతోన్న వీడియో..ఓ రేంజ్‌లో లైక్స్, షేర్స్

ప్రస్తుతం సాయం అనే మాట చాలా పెద్దది అయిపోయింది. ఒకరికి మరొకరు సాయం చెయ్యాలని కూడా పదే, పదే చెప్పాల్సి వస్తుంది. యాంత్రిక జీవితాల్లో పడి మనుషులు ఎమోషన్స్ మిస్ అవుతున్నారు.

గూడు కట్టుకుంటున్న బాతుకు బాలుడి సాయం..సోషల్ మీడియాలో వైరలవుతోన్న వీడియో..ఓ రేంజ్‌లో లైక్స్, షేర్స్
Follow us

|

Updated on: Dec 14, 2020 | 9:58 PM

ప్రస్తుతం సాయం అనే మాట చాలా పెద్దది అయిపోయింది. ఒకరికి మరొకరు సాయం చెయ్యాలని కూడా పదే, పదే చెప్పాల్సి వస్తుంది. యాంత్రిక జీవితాల్లో పడి మనుషులు ఎమోషన్స్ మిస్ అవుతున్నారు. అయితే ఇప్పుడు చదవబోయే వార్త మీ మనసుకు కాస్త హాయిని కలిగించొచ్చు. ఓ బాతు చెరువులో గూడు కట్టుకుంటోంది. ఆ బాతుకు ఓ చిన్ని బాలుడు సాయం చేస్తున్నాడు. వావ్‌.. వినడానికి చాలా బాగుంది కదూ.. చూస్తే ఇంకా బాగుంటుంది. కింది వీడియోలో చూడండి.. ఆ బాలుడు కట్టెపుల్లలు తీసుకొచ్చి ఇస్తుండగా.. బాతు వచ్చి వాటిని ముక్కుతో కరుచుకొని వెళ్లి గూడుకట్టుకుంటోంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో విపరితంగా వైరల్‌ అవుతోంది. నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.

ఈ అద్భుతమైన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌కు చెందిన సుశాంత నందా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘గూడు కట్టుకునేందుకు అందరికీ సహాయం చేయండి’ అని దీనికి శీర్షిక పెట్టారు. 33 సెకన్ల నిడివిగల ఈ క్లిప్‌ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకూ ఈ వీడియోను వేల సంఖ్యలో వీక్షించారు.

Also Read :

డ్యాం ఎత్తును ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గించడంలేదు..పోలవరం గడ్డ సాక్షిగా తేల్చి చెప్పిన సీఎం జగన్

ఆఫీసులు, స్కూళ్లలో వ్యాక్సిన్ సెంటర్లు..పూర్తి విధానం ఇదే..రాష్ట్రాలకు కేంద్రం గైడ్ లైన్స్

ఆ విషయంలో హర్టయ్యాడు..పెళ్లి అయిన వెంటనే వధువును కల్యాణమండపంలో వదిలేసి వెళ్లిపోయాడు

Latest Articles