తిరుమలలో వీఐపీ దర్శనాలకు బ్రేక్!

తిరుమలలో వీఐపీలకు ఇస్తున్న ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలను త్వరలో రద్దు చేస్తామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పష్టంచేశారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీలు సైతం ఏడాదిలో ఒకసారే శ్రీవారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తితిదే పాలకమండలి సభ్యులను 10 రోజుల్లో సీఎం నియమిస్తారని వెల్లడించారు. అంతకుముందు తిరుపతిలో తితిదే బర్డ్‌ ఆస్పత్రిని తుడా ఛైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్య సేవలు, […]

తిరుమలలో వీఐపీ దర్శనాలకు బ్రేక్!
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 13, 2019 | 7:37 PM

తిరుమలలో వీఐపీలకు ఇస్తున్న ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలను త్వరలో రద్దు చేస్తామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పష్టంచేశారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీలు సైతం ఏడాదిలో ఒకసారే శ్రీవారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తితిదే పాలకమండలి సభ్యులను 10 రోజుల్లో సీఎం నియమిస్తారని వెల్లడించారు. అంతకుముందు తిరుపతిలో తితిదే బర్డ్‌ ఆస్పత్రిని తుడా ఛైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్య సేవలు, సదుపాయాలపై ఆరా తీశారు.

ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమలకు దేశ, విదేశాల నుండి ఎంతో మంది తరలివస్తుంటారు. అయితే వీఐపీల దర్శన సమయంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా పండుగలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఇతరత్రా రోజుల్లో వీఐపీల తాకిడి అధికంగా ఉంటుంది. దీంతో సామాన్య భక్తుల దర్శన విషయంలో మార్పులు చేర్పులు చేస్తుంటారు టీటీడీ అధికారులు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టీటీడీపై దృష్టి సారించింది. సామాన్యుడికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసేందుకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.