Homemade Lip Balm: ఈ చిట్కాలతో ఇంట్లోనే లిప్ బామ్ తయారీ.. పిల్లలకు వాడేయవచ్చు!

|

Dec 22, 2024 | 3:03 PM

వింటర్ సీజన్‌లో ఎక్కువగా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చర్మం అంతా పొలుసులుగా తెల్లగా కనిపిస్తూ చికాకుగా ఉంటుంది. ముఖ్యంగా పెదాలు ఎండిపోయి పగిలిపోతూ ఉంటాయి. పెదాల కోసం కూడా ప్రత్యేకంగా కేర్ తీసుకోవాలి. ఇంట్లోనే తయారు చేసే ఈ లిప్ బామ్ చక్కగా పని చేస్తుంది..

Homemade Lip Balm: ఈ చిట్కాలతో ఇంట్లోనే లిప్ బామ్ తయారీ.. పిల్లలకు వాడేయవచ్చు!
Lip Care
Follow us on

చలికాలంలో స్కిన్ కేర్‌కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. వింటర్ సీజన్ వస్తే చర్మం పగిలిపోవడం, కాళ్లు, చేతులపై తెల్లగా రావడం, పెదాలు పగిలిపోయి.. అందవిహీనంగా కనిపిస్తుంది. అందరూ ఈ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసే ఉంటారు. ఈ క్రమంలోనే స్కిన్‌కి ఎక్కువగా కేర్ తీసుకుంటూ ఉంటారు. క్రీమ్స్, లోషన్స్, మాయిశ్చరైజర్స్ రాస్తూ ఉంటారు. ఇవి రాయడం వల్ల చర్మం మళ్లీ సాధారణంగా మారుతుంది. కానీ చాలా మంది పెదాల సంగతి మర్చిపోతారు. పెదాలు పగిలిపోవడం వల్ల.. చర్మం పొరలు పొరలుగా ఊడిపోతూ చూసేందుకు కూడా చికాకుంగా అనిపిస్తుంది.

మరికొందరికి అయితే పెదాలు బాగా ఎండిపోయి రక్తం కూడా కారుతూ ఉంటుంది. పిల్లలకు ఇదే పరిస్థితి నెలకొని ఉంటుంది. పెదాల అందాన్ని పెంచేందుకు మనం ఇంట్లోనే లిప్ బామ్ తయారు చేసుకోవచ్చు. బయట దొరికే ప్రాడెక్ట్స్‌లో ఎక్కువగా రసాయనాలు కలుపుతూ ఉంటారు. వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఈ లిప్ బామ్ తయారు చేసుకోండి. దీన్ని పిల్లలకు కూడా రావయచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. చాలా బెస్ట్‌గా వర్క్ అవుట్ అవుతుంది. మరి ఈ లిప్ బామ్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూసేయండి.

కొబ్బరి నూనెతో లిప్ బామ్:

మనకు ఈజీగా దొరికే వాటిల్లో కొబ్బరి నూనె కూడా ఒకటి. కొబ్బరి నూనె చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. కొబ్బరి నూనె ఉపయోగించి కూడా లిప్ బామ్ తయారు చేసుకోవచ్చు. ఇందుకు తేనె, కొబ్బరి నూనె, విటమిన్ ఈ క్యాప్సూల్స్ కావాలి.

ఇవి కూడా చదవండి

ముందుగా కొబ్బరి నూనెను డబుల్ బాయిలింగ్ పద్దతిలో వేడి చేయండి. కొబ్బరి నూనె కాస్త వేడిగా ఉన్నప్పుడు.. అందులో కొద్దిగా తేనె కలపండి. మీరు ఎంచుకున్న క్వాంటిటీ బట్టి తేనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఓ చిన్న బాక్స్‌లోకి తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టండి. ఇప్పుడు ఇది గడ్డ కడుతుంది. దీన్ని రోజుకు మూడు, నాలుగు సార్లు అయినా పెదాలకు రాస్తూ ఉండండి. ఇలా ఈజీగా లిప్ బామ్ తాయరు చేసుకోవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.