Weight Loss: ఏడాదిలోనే 111 నుంచి 66 కిలోలకు.. వైరల్ అవుతున్న యువతి వెయిట్ లాస్ జర్నీ!

ఈ రోజుల్లో చాలా మంది బరువు తగ్గి, స్లిమ్‌గా మారాలని ఆశిస్తున్నారు. ఇందుకోసం జిమ్‌కు వెళ్తూ వర్కౌట్స్ చేస్తున్నారు. కానీ కొన్ని రోజులకే దాన్ని వదిలేస్తున్నారు. కేవలం ఒక్క సంవత్సరంలోనే 111 కిలోల నుంచి 66 కిలోలకు తగ్గి అలాంటి వారికి ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తోంది ఓ మహిళ. తాను ఏడాదిలోనే 44 కేజీలు తగ్గడంలో తాను ఫాలో అయిన జీవనశైలే కీలక పాత్ర పోషించిందని ఆమె చెప్పుకొచ్చింది. మరీ అమె బరువు తగ్గేందుకు ఏలాంటి ఏం చేసిందో ఇక్కడ తెలుసుకుందాం.

Weight Loss: ఏడాదిలోనే 111 నుంచి 66 కిలోలకు.. వైరల్ అవుతున్న యువతి వెయిట్ లాస్ జర్నీ!
Woman Loses 45 Kg In Just One Year

Updated on: Oct 13, 2026 | 2:54 PM

ఏక్తా బిందాల్ అనే మహిళ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో ఆమె తన వెయిట్‌లాస్ జర్నీ గురించి పంచుకుంది. 2025 సెప్టెంబర్ 1న తాను 111 కిలోలు ఉన్నానని.. సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత, 66 కిలోలకు చేరుకున్నాను అని రాసుకొచ్చింది. బరువు తగ్గడానికి తాను అనుసరించిన ఖచ్చితమైన వివరాలను వెల్లడించనప్పటికీ, జిమ్‌లో తీవ్రంగా వర్కౌట్ చేస్తున్న వీడియోలను ఆమె పంచుకుంది. కేవలం ఏడాది వ్యవధిలోనే ఆమె సాధించిన ఈ మార్పు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

అయితే ఒక సంవత్సరంలో 45 కిలోల బరువు తగ్గడం అనేది చాలా పెద్ద మార్పు అని, అయితే ఇది ఎంతవరకు సురక్షితమనేది ఆ వ్యక్తి ఆరోగ్య స్థితి, పోషకాహార అలవాట్లు, వైద్య పర్యవేక్షణపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వైద్యుల ప్రకారం.. బరువు తగ్గడం కోసం కార్బోహైడ్రేట్లు, కొవ్వులు లేదా ఇతర ఆహారాలను పూర్తి మానేయాల్సిన అవసరం లేదని.. ఏదైనా ఒక ఆహార విభాగాన్ని పూర్తిగా తొలగిస్తే ఆ డైట్‌ను ఎక్కువ కాలం కొనసాగించడం కష్టమవుతుందని, పైగా పోషకాహార లోపాలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

అలాగే తగినంత ప్రొటీన్లు, కూరగాయలు, తృణధాన్యాలు లేదా ఇతర కార్బోహైడ్రేట్ ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. అయితే ఇవి తీసుకున్నప్పుడూ.. వాటిని లిమిట్‌లో ఒక నిర్దిష్ట క్వాంటిటీలో తీసుకోవడం మాత్రం చాలా ముఖ్యమని తెలిపారు. అలాగే మీరు తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలతో సమగ్రంగా ఉండేలా చూసుకోవాలి తెలిపారు.

బరువు తగ్గిన తర్వాత ఏం చేయాలి.

చాలా మంది బరువు తగ్గాం కదా.. ఇక ఎలాంటి డైట్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని అనుకుంటారు. కానీ
భారీగా బరువు తగ్గిన తర్వాత, ఆ బరువును అలాగే నిలబెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. శారీరకంగా పెద్ద మార్పు వచ్చిన తర్వాత ఆకలి, ఆహారపు అలవాట్లు, శరీర శక్తి అవసరాలు మారవచ్చని, అందుకే బరువు తగ్గించే డైట్ నుంచి క్రమంగా నిలకడైన సాధారణ ఆహార పద్ధతికి మారాలే తప్ప పాత అలవాట్లకు తిరిగి వెళ్లకూడదని సూచించారు.మీరు శక్తివంతంగా ఉండేందుకు బలం పెంచే వ్యాయామాలు, సరిపడా ప్రొటీన్లు, రోజూ శారీరక శ్రమ తప్పనిసరి అని ఆమె పేర్కొన్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us