AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రెడ్‌ ప్యాకెట్‌లో మొదటి, చివరి ముక్కలు ఎందుకు భిన్నంగా ఉంటాయో తెలుసా? అసలు సంగతి ఇదే

ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా చాలా మందికి బ్రెడ్‌ తినడం అలవాటు. మీరు ఎప్పుడైనా బ్రెడ్ ప్యాకెట్ తెరిచిన వెంటనే దానిలోని మొదటి, చివరి ముక్కలు గమనించారా? ఇవి మిగిలిన ముక్కల కంటే కొద్దిగా భిన్నంగా ఉండటాయి. బ్రెడ్ మొదటి, చివరి ముక్కలు కొద్దిగా ముదురు రంగులో, గట్టి అంచులతో, ఆకారంలో కూడా భిన్నంగా ఉంటాయి. చాలా మందికి ఆ ముక్కలను తినడం ఇష్టం ఉండదు. దీంతో ఈ ముక్కలను సాధారణంగా పక్కన పెట్టేస్తుంటారు. కానీ ఈ బ్రెడ్ ముక్కలు ఇలా తయారవ్వడం వెనుక ఒక ప్రత్యేకమైన, ఆసక్తికరమైన కారణం ఉంది. అదేంటంటే..

బ్రెడ్‌ ప్యాకెట్‌లో మొదటి, చివరి ముక్కలు ఎందుకు భిన్నంగా ఉంటాయో తెలుసా? అసలు సంగతి ఇదే
Bread First And Last Slices
Srilakshmi C
|

Updated on: Apr 27, 2026 | 3:20 PM

Share

మనం మన దైనందిన జీవితంలో ఎన్నో వస్తువులను పెద్దగా ఆలోచించకుండా వాడేస్తుంటాం. కానీ ఆ సాధారణ వస్తువులను నిశితంగా పరిశీలిస్తే వాటి వెనుక ఉన్న శాస్త్రాన్ని, వాటి ఉపయోగాన్ని తెలుసుకోవచ్చు. రొట్టెలు, కేకులు అలాంటివే. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ ఇవి భాగమైపోయాయి. కానీ వాటి తయారీ వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. బ్రెడ్, కేక్‌లను శాండ్‌విచ్‌లు, టోస్ట్, బర్గర్‌లు, తీపి వంటకాలలో విరివిగా ఉపయోగిస్తారు. అన్ని వయసుల వారు వీటిని ఇష్టపడతారు. కానీ బ్రెడ్ ప్యాకెట్‌లోని మొదటి, చివరి ముక్కలు ఇతక ముక్కల మాదిరిగా కాకుండా వేర్వేరుగా ఉండటానికి కారణం.. పొరపాటు కాదని, అది బేకింగ్ ప్రక్రియ సహజ ఫలితమని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

ఓవెన్‌లో బ్రెడ్ లేదా కేక్‌ను బేక్ చేసినప్పుడు బ్రెడ్ ముందు, వెనుక భాగాలు ఎక్కువ ప్రత్యక్ష వేడికి గురవుతాయి. ఈ ప్రాంతాలు ఎక్కువ వేడికి గురికావడం వల్ల అవి త్వరగా ఉడుకుతాయి. దీనివల్ల అంచులు ముదురు రంగులోకి మారి కొంచెం గట్టిపడతాయి. అయితే మధ్య భాగం మృదువుగా, స్పాంజిలా ఉంటుంది. ఇంత విభిన్నంగా కనిపించే బ్రెడ్ అంచులను కంపెనీలు ఎందుకు తొలగించవు? నిజానికి ఈ ముక్కలు ప్యాకేజీలోని మిగిలిన బ్రెడ్‌కు రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఈ ముక్కలు బ్రెడ్‌లోని మృదువైన లోపలి భాగాలను బయటి వాతావరణం నుంచి కాపాడి, తద్వారా లోపలి ముక్కల్లోని తేమను నిలుపుతాయి.

బ్రెడ్‌ ప్యాకెట్‌ను తెరిచిన తర్వాత ఉండే మొదటి, చివరి ముక్కలు.. మధ్య ముక్కలోకి గాలి చేరకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల అది ఎండిపోయి పొడిబారకుండా ఉంటుంది. ఈ కారణంగానే రొట్టె చాలా కాలం పాటు తాజాగా, మృదువుగా ఉంటుంది. కాబట్టి ఇకపై మీరు బ్రెడ్‌ ప్యాకెట్‌ కొన్నప్పుడు మొదటి లేదా చివరి ముక్క భిన్నంగా కనిపించాయని, అవి పనికిరావని పారేసే ముందు వాటి ఉపయోగాన్ని తెలుసుకోండి. అది కేవలం భిన్నంగా కనిపించే ముక్క మాత్రమే కాదు, రొట్టెను తాజాగా ఉంచే ఒక సహజ రక్షణ పొర.

ఇవి కూడా చదవండి

నోట్‌: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. టీవీ9 తెలుగు దీనిని నిర్ధారించడం లేదు. పూర్తి సమాచారం కోసం వైద్య నిపుణులను సంపద్రించండి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మహిళను ముక్కలుగా నరికి బిర్యానీ గిన్నెలో దాచిపెట్టారు..
మహిళను ముక్కలుగా నరికి బిర్యానీ గిన్నెలో దాచిపెట్టారు..
పునాది నుంచి స్లాబ్ వరకు ఒక పిల్లర్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
పునాది నుంచి స్లాబ్ వరకు ఒక పిల్లర్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
స్నేహితుల ఇంటికి వెళ్లిన బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి!
స్నేహితుల ఇంటికి వెళ్లిన బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి!
విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!
విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!
కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక కొత్త నాటకం?
కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక కొత్త నాటకం?
టీమిండియా నెక్స్ట్ టెస్ట్ ఎవరితో? షెడ్యూల్, టైమింగ్స్ ఇవే..?
టీమిండియా నెక్స్ట్ టెస్ట్ ఎవరితో? షెడ్యూల్, టైమింగ్స్ ఇవే..?
కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !
కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !
గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..
గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..
చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు
చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు
తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..