AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baking Soda: బేకింగ్ సోడా మేజిక్.. బాత్‌రూమ్‌ నుంచి బట్టల వరకు క్షణాల్లో తళతళలాడుతాయ్‌!

బేకింగ్ సోడా ప్రతి ఇంటి వంటగదిలో తప్పక ఉంటుంది. దీనిని స్వీట్ సోడా లేదా బేకింగ్ సోడా అని కూడా పిలుస్తారు. దీనిని వివిధ రకాల ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారు. కిడ్నీ బీన్స్, శనగలు వంటి ఆహారాలను సరిగ్గా ఉడికించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. గంటల సమయం పట్టే పనులను కూడా బేకింగ్ సోడా సహాయంతో క్షణాల్లో పూర్తి చేయవచ్చు.

Baking Soda: బేకింగ్ సోడా మేజిక్.. బాత్‌రూమ్‌ నుంచి బట్టల వరకు క్షణాల్లో తళతళలాడుతాయ్‌!
Baking Soda Cleaning Tips
Srilakshmi C
|

Updated on: Apr 27, 2026 | 3:42 PM

Share

సోడియం బైకార్బోనేట్ అని  పిలిచే బేకింగ్ సోడాను కేకులు, బ్రెడ్ వంటి బేక్ చేసిన వస్తువులను పొంగించడానికి సాధారణంగా ఉపయోగిస్తారు. పెరుగు, నిమ్మరసం వంటి పదార్థాలతో దీనిని కలిపినప్పుడు ఇది వాయు బుడగలను సృష్టిస్తుంది. ఈ బుడగలు బేక్ చేసిన వస్తువులు పొంగడానికి, బయట మృదువుగా కరకరలాడుతూ ఉండటానికి సహాయపడతాయి. బేకింగ్ సోడా క్షార గుణాలు ఇతర అనేక రకాల పనులకు కూడా ఉపయోగపడతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

దంతాల శుభ్రత

దంతాలపై మరకలు, పసుపుదనం ఇబ్బందికరంగా ఉంటాయి. వాటిని శుభ్రం చేయడానికి ఖరీదైన టూత్‌పేస్ట్‌లను కూడా కొనుగోలు చేసే బదులు బేకింగ్ సోడాతో దంతాల నుండి పసుపుదనాన్ని చిటికెలో తొలగించవచ్చు. బేకింగ్ సోడాను కొద్దిగా నీటితో కలిపి చిక్కటి పేస్ట్ లా తయారుచేసి, దానిని మీ టూత్‌బ్రష్‌కు లేదా వేలికి అప్లై చేసి దంతాలు తోముకోవాలి. దీనిని వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఉపయోగించాలి. లేకపోతే అది దంతాల మీదున్న ఎనామెల్‌ను అరిగిపోయేలా చేసి దంతాలను సున్నితంగా మార్చగలదు. అందుకే దీనిని అతిగా వాడకుండా ఉండండి.

నోటి దుర్వాసన తొలగింపు

బేకింగ్ సోడా ఒక అద్భుతమైన క్లెన్సర్. బ్యాక్టీరియాను నివారించడంలో చక్కగా సహాయపడుతుంది. ఇది దుర్వాసనను తగ్గించడమే కాకుండా టూత్‌బ్రష్ సులభంగా చేరలేని ప్రదేశాలలో ఉన్న మురికిని కూడా శుభ్రపరుస్తుంది. దీనిని మౌత్‌వాష్‌గా ఉపయోగించవచ్చు. ఇందుకోసం అర టీ స్పూన్ బేకింగ్ సోడాను గోరువెచ్చని నీటిలో కరిగించి దానితో పుక్కిలించాలి. ఇది మీ శ్వాసను తాజాగా ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి

బట్టలు మెరిపించడానికి

బట్టలపై మరకలను తొలగించడంలో బేకింగ్ సోడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనికోసం డిటర్జెంట్‌లో 2-3 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేసి బట్టలు ఉతకాలి. దీనివల్ల బట్టలు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఎందుకంటే బేకింగ్ సోడా ఒక లవణం. ఇది మురికిని సులభంగా తొలగిస్తుంది. బట్టలపై మొండి మరక ఉంటే బేకింగ్ సోడా, నిమ్మరసంతో పేస్ట్ తయారు చేసి దానిని మరకపై అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత సబ్బుతో శుభ్రం చేయాలి. దీంతో బట్టలు శుభ్రంగా, మెరిసేలా అవుతాయి.

బాత్రూం క్లీనింగ్

బాత్రూం, టైల్స్, నేలపై ఉన్న మురికి, సబ్బు మరకలు, ఉప్పు నీటి మరకలను శుభ్రం చేయడంలో మీరు ఇబ్బంది పడుతుంటే.. బేకింగ్ సోడాను ఉపయోగించి చూడండి. ఇది శ్రమను, శక్తిని చాలా వరకు ఆదా చేస్తుంది. బేకింగ్ సోడా, వెనిగర్‌ను కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దానికి కొద్దిగా గోరువెచ్చని నీటిని కలిపి, నేలతో సహా మరకలు ఉన్న ప్రదేశాలలో పూయాలి. కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు దానిని అలాగే వదిలేసి.. ఆ తర్వాత శుభ్రం చేయాలి.

వెండి వస్తువులను మెరిపిస్తుంది

మీ ఇంట్లో వెండి వస్తువులు లేదా ఆభరణాలు ఉంటే వాటిని శుభ్రం చేయడానికి బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. కొన్నిసార్లు వాడిన తర్వాత, వెండి వస్తువులు రంగు మారడం మొదలవుతాయి. కాబట్టి వాటిని పాలిష్ చేయాలి లేదా శుభ్రం చేయాలి. మీకు త్వరిత పరిష్కారం కావాలంటే బేకింగ్ సోడాను గోరువెచ్చని నీటిలో కలిపి.. ఈ ద్రావణంలో వెండి వస్తువులను కొన్ని నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత దానిని స్పాంజ్ లేదా మృదువైన బ్రష్‌తో శుభ్రం చేస్తే సరి. అంతే క్షణాల్లో వెండి వస్తువులు కొత్తదానిలా మెరుస్తాయి.

నోట్‌: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. టీవీ9 తెలుగు దీనిని నిర్ధారించడం లేదు. పూర్తి సమాచారం కోసం వైద్య నిపుణులను సంపద్రించండి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
చీకటి గదిలో కిరోసిన్ దీపం, కొవ్వొత్తి.. మొదట దేన్ని వెలిగిస్తారు?
చీకటి గదిలో కిరోసిన్ దీపం, కొవ్వొత్తి.. మొదట దేన్ని వెలిగిస్తారు?
ఒక్క గొడవతో మధ్యలోనే ఆగిపోయిన తరుణ్ సినిమా.. అసలేం జరిగిందంటే..
ఒక్క గొడవతో మధ్యలోనే ఆగిపోయిన తరుణ్ సినిమా.. అసలేం జరిగిందంటే..
ఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్థాన్ పోరు ఎప్పుడంటే?
ఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్థాన్ పోరు ఎప్పుడంటే?
ఈ సింపుల్‌ చిట్కాలతో ఈజీగా ఫ్రిజ్‌లోని కూరగాయల ట్రే క్లీన్
ఈ సింపుల్‌ చిట్కాలతో ఈజీగా ఫ్రిజ్‌లోని కూరగాయల ట్రే క్లీన్
58 ఏళ్లు దాటాక పీఎఫ్ వడ్డీ ఆగిపోతుందా..? కేంద్రం క్లారిటీ
58 ఏళ్లు దాటాక పీఎఫ్ వడ్డీ ఆగిపోతుందా..? కేంద్రం క్లారిటీ
పోలీసులు ఇక అలా చెప్పలేరు.. మీ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం..
పోలీసులు ఇక అలా చెప్పలేరు.. మీ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం..
రోజూ చేసే ఈ 3 తప్పులే వెన్నెముకకు ముప్పు.. నిర్లక్ష్యం చేయొద్దు!
రోజూ చేసే ఈ 3 తప్పులే వెన్నెముకకు ముప్పు.. నిర్లక్ష్యం చేయొద్దు!
బొబ్బట్లు వేసిన మంత్రి సతీమణి.. నూజివీడులో కూటమి వినూత్న ప్రచారం!
బొబ్బట్లు వేసిన మంత్రి సతీమణి.. నూజివీడులో కూటమి వినూత్న ప్రచారం!
రుద్రాక్షలో ప్రభాస్ ఫొటో.. కుప్పంలో అభిమాని కళా నైపుణ్యం
రుద్రాక్షలో ప్రభాస్ ఫొటో.. కుప్పంలో అభిమాని కళా నైపుణ్యం
వైట్, రెడ్ రైస్ కన్నా ఈ అన్నం 10 రెట్లు బలం..
వైట్, రెడ్ రైస్ కన్నా ఈ అన్నం 10 రెట్లు బలం..