మీలో ఈ 5 లక్షణాలు ఉన్నాయా?.. అయితే మిమ్మల్ని ధనవంతులు కాకుండా ఎవ్వరూ ఆపలేరు!

Updated on: Oct 20, 2026 | 3:28 PM

ధనవంతులు కావాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ దాని వెనుక ఉండే కష్టాలను దాటేందుకు చాలామంది ప్రయత్నించరు. డబ్బు అనేది కేవలం అదృష్టం వల్ల మాత్రమే వస్తుందని ఎక్కువ మంది భావిస్తుంటారు. కానీ వాస్తవానికి డబ్బును నిర్వహించే పద్ధతి, మనం తీసుకునే నిర్ణయాలు, వైఫల్యాలను ఎదుర్కొనే దృక్పథం వంటి అంశాలే ఒక వ్యక్తిని ధనవంతుడిగా తీర్చిదిద్దుతాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. ధనవంతులు కావాలనుకునే వ్యక్తుల్లో ఉండాల్సిన 5 ముఖ్యమైన లక్షణాలు ఇవే:

1 / 5
తాత్కాలిక సుఖాలకు చెక్:చాలామంది జీతం చేతికి రాగానే వెంటనే ఖర్చు చేస్తుంటారు. అలా కాకుండా, అందులో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం దాచిపెట్టే అలవాటు ఉన్నవారు ఆర్థిక విషయాల్లో గొప్ప విజయాలు సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సైకాలజీలో దీనిని 'డిలేడ్ గ్రాటిఫికేషన్' అంటారు. అంటే తాత్కాలిక సుఖాల కోసం డబ్బును వృథా చేయకుండా ఆదా చేయడం. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం రాదు.

2 / 5
నేర్చుకునే తపన: కొత్త విషయాలు నేర్చుకోవడానికి, తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి నిరంతరం సిద్ధంగా ఉండేవారు ఆర్థికంగా త్వరగా ఎదుగుతారు. మనస్తత్వశాస్త్రంలో దీనిని గ్రోత్ మైండ్‌సెట్ అంటారు. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలనే కుతూహలమే మీలో నైపుణ్యాలను పెంచుతుంది. ఏదైనా పనిలో అనుకున్న విజయం దక్కకపోయినా నిరాశపడకుండా, దాని నుంచి పాఠాలు నేర్చుకుని కొత్త మార్గాలను అన్వేషించే లక్షణం ఉన్నవారు వ్యాపారంలోనే కాకుండా ఉద్యోగాల్లోనూ ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

3 / 5
నిలకడైన అలవాట్లు:జీవితంలో పెద్ద విజయాలు సాధించాలంటే ఒక్కసారి ప్రయత్నించి వదిలేయకూడదు. విజయం దక్కేంత వరకు నిలకడగా (కన్సిస్టెన్సీగా) ప్రయత్నిస్తూనే ఉండాలి. సంపాదనలో క్రమం తప్పకుండా కొంత పొదుపు చేయడం, ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు రాసుకోవడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, ఆర్థిక లక్ష్యాలను సమీక్షించుకోవడం వంటి అలవాట్లు కాలక్రమేణా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి.

4 / 5
. ఎమోషన్ కంట్రోల్ :డబ్బు విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. భయం, దురాశ, అమితమైన ఉత్సాహం వంటి భావోద్వేగాలు ఆర్థిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మార్కెట్లలో వచ్చే హెచ్చుతగ్గులను చూసి భయంతో పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం లేదా ఇతరుల లాభాలను చూసి ఆలోచించకుండా అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టడం వంటివి తీవ్ర నష్టాలకు దారితీస్తాయి. కాబట్టి భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వాస్తవాలను, సమాచారాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి.

5 / 5
స్వీయ విశ్లేషణ: సమస్యలు ఎదురైనప్పుడు ఇతరులపై ఆధారపడకుండా, వాటిని స్వయంగా పరిష్కరించుకునే లక్షణాన్ని పెంపొందించుకోవాలి. ఆర్థికంగా ముందడుగు వేయాలనుకునే వారికి ప్రస్తుత పరిస్థితులను వాస్తవికంగా అంచనా వేయగల సామర్థ్యం ఉండాలి. అన్ని పరిస్థితులూ మన ఆధీనంలో ఉండకపోవచ్చు; ఆర్థిక సంక్షోభాలు, ఉపాధి అవకాశాల కొరత, కుటుంబ బాధ్యతలు వంటి బాహ్య అంశాలు ఆర్థిక ఎదుగుదలను ప్రభావితం చేసినప్పటికీ, స్వీయ అవగాహన ఉన్నవారు పరిస్థితులకు తగినట్లుగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతారు.ఈ లక్షణాలు అలవర్చుకుంటే కచ్చితంగా ఏదో ఒక రోజు ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుని ధనవంతులు కావచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us