Alcohol: ఆల్కహాల్‌ ఒక్క కాలేయాన్నే కాదు.. మరెన్నో అవయవాలను దెబ్బ తీస్తుంది

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇది తెలిసినా చాలా మంది మద్యం ప్రియులు ఈ అలవాటును మాత్రం మానుకోవడానికి ఇష్టపడరు. రోజుకు ఒక్క పెగ్ వేస్తే ఏమవుతుందిలే అనుకుంటూ రోజూ తాగేస్తుంటారు. దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కారణవవుతుంది. ముఖ్యంగా ఆల్కహాల్ అనగానే...

Alcohol: ఆల్కహాల్‌ ఒక్క కాలేయాన్నే కాదు.. మరెన్నో అవయవాలను దెబ్బ తీస్తుంది
Alcohol
Follow us

|

Updated on: Jun 16, 2024 | 12:57 PM

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇది తెలిసినా చాలా మంది మద్యం ప్రియులు ఈ అలవాటును మాత్రం మానుకోవడానికి ఇష్టపడరు. రోజుకు ఒక్క పెగ్ వేస్తే ఏమవుతుందిలే అనుకుంటూ రోజూ తాగేస్తుంటారు. దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కారణవవుతుంది. ముఖ్యంగా ఆల్కహాల్ అనగానే మనలో చాలా మంది కేవలం లివర్‌ ఆరోగ్యం మాత్రమే దెబ్బ తింటుందనే భావనలో ఉంటాం. అయితే ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల శరీరంలోని ఇతర అవయవాలపై కూడా ప్రభావం తప్పదని హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఆల్కహాల్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతీరోజూ ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల లివర్‌ అనారోగ్యం బారిన పడుతుందని అంటున్నారు. ఇది కాలేయ కణాలను నాశనం చేస్తుంది. సిర్రోసిస్ వంటి తీవ్రమైన వ్యాధులను కూడా కలిగిస్తుంది. అంతే కాదు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్యలు కూడా వస్తాయి.

* ఎక్కువ ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం గడ్డకడుతుంది. ఇది మీ గుండె ఆరోగ్యంపై నేరుగా ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అతిగా ఆల్కహాల్ సేవించే వ్యక్తి తన గుండెకు రక్తాన్ని పంప్ చేయడంలో సమస్యలు తప్పవని నిపుణులు అంటున్నారు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని, ఇది గుండెపోటుకు కారణమవుతుందని అంటున్నారు.

* అధిక మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మన నాడీ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది మెదడు సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది, మాట్లాడే సామర్థ్యం తగ్గుతుంది. డిప్రెషన్‌, మెదడు పనితీరుపై ప్రభావం పడుతుంది.

* ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. ఐరన్‌ లోపం కారణంగా రక్తహీనత సమస్య వేధిస్తుంది. శరీరంలో రక్తం స్థాయిలు తగ్గుతాయి. శరీరంలో రక్తం తక్కువగా ఉండటం వల్ల బలహీనత, తల తిరగడం, అపస్మారక స్థితి వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

* ఆల్కహాల్‌కు అలవాటు పడ్డవారికి క్యాన్సర్‌ వచ్చే అకవాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వ్యక్తులు నోటి, గొంతు, బ్రెస్ట్ క్యాన్సర్‌, పేగు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Latest Articles
ఆ స్టార్ హీరో సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశాడా..? అప్పుడే..
ఆ స్టార్ హీరో సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశాడా..? అప్పుడే..
శత్రువులను ఓడించడానికి చాణక్యుడి చెప్పిన విషయాలు పాటించి చూడండి..
శత్రువులను ఓడించడానికి చాణక్యుడి చెప్పిన విషయాలు పాటించి చూడండి..
తలపొగరోడు అందించిన క్యాచ్.. మిస్ చేసిన పంత్.. రోహిత్ కోపం చూశారా?
తలపొగరోడు అందించిన క్యాచ్.. మిస్ చేసిన పంత్.. రోహిత్ కోపం చూశారా?
ఎమ్మెల్యేలు, నేతలు చేజారకుండా బీఆర్ఎస్ పక్కా ఫ్లాన్..!
ఎమ్మెల్యేలు, నేతలు చేజారకుండా బీఆర్ఎస్ పక్కా ఫ్లాన్..!
బీర్‌ తాగితే కొలెస్ట్రాల్ మైనంలా కరిగిపోతుందట..!
బీర్‌ తాగితే కొలెస్ట్రాల్ మైనంలా కరిగిపోతుందట..!
కాంగ్రెస్ - బీఆర్ఎస్ నేతల చిచ్చు రాజేసిన బూడిద..!
కాంగ్రెస్ - బీఆర్ఎస్ నేతల చిచ్చు రాజేసిన బూడిద..!
బంగ్లాపై థ్రిల్లింగ్ విక్టరీ.. సెమీస్ చేరిన ఆఫ్గాన్..
బంగ్లాపై థ్రిల్లింగ్ విక్టరీ.. సెమీస్ చేరిన ఆఫ్గాన్..
రాజస్థాన్‌లో జలపాతాలు.. వర్షాకాలంలో వీటి అందాలు కనులకు విందు
రాజస్థాన్‌లో జలపాతాలు.. వర్షాకాలంలో వీటి అందాలు కనులకు విందు
ఏంటీ.. ఈ అమ్మాయి జై బోలే తెలంగాణ మూవీ హీరోయినా..? గుర్తుపట్టలేం బ
ఏంటీ.. ఈ అమ్మాయి జై బోలే తెలంగాణ మూవీ హీరోయినా..? గుర్తుపట్టలేం బ
నీళ్లలో ఈదుతూ నదిని దాటుతున్న ఏనుగుల గుంపు.. అద్భుతమైన దృశ్యం
నీళ్లలో ఈదుతూ నదిని దాటుతున్న ఏనుగుల గుంపు.. అద్భుతమైన దృశ్యం