Cumin Seeds for Uric Acid: యూరిక్ యాసిడ్‌కు చెక్ పెట్టే జీలకర్ర.. ఎలా వాడాలంటే..

|

Dec 22, 2024 | 4:29 PM

ప్రమాదకరమైన దీర్ఘకాలిక వ్యాధుల్లో యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. ఒక్కసారి మొదలైదంటే జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది. తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప కంట్రోల్ చేయలేం. యూరిక్ యాసిడ్‌ని కంట్రోల్ చేయడంలో జీలకర్ర కూడా ఎంతో చక్కగా హెల్ప్ చేస్తుంది. మరి జీలకర్రను ఎలా తీసుకోవాలో చూసేయండి..

Cumin Seeds for Uric Acid: యూరిక్ యాసిడ్‌కు చెక్ పెట్టే జీలకర్ర.. ఎలా వాడాలంటే..
Uric Acid
Follow us on

ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు బాగా ఎక్కువైపోతున్నాయి. ఎటు నుంచి ఏ వ్యాధి ఎటాక్ చేస్తుందో అర్థం కావడం లేదు. కొత్త కొత్త వ్యాధులు సైతం జనాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇలా వయసుతో సంబంధం లేకుండా ఎటాక్ చేసే వ్యాధుల్లో యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. యూరిక్ యాసిడ్ అనేది ఎముకల జాయింట్స్‌లో వస్తాయి. కొద్దిగా మొదలైన యూరిక్ యాసిడ్ మొత్తం శరీరం అంతా వ్యాపించి ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. సాధారణంగా మనం తినే ఆహారంలో ప్యూరిన్స్ విచ్ఛిన్నమైనప్పుడు శరీరంలో యూరిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. మూత్రం ద్వారా ఇది బయటకు పోతుంది. కానీ అలా వెళ్లకుండా శరీరంలోనే మిగిలిపోతే మాత్రం అది యూరిక్ యాసిడ్‌గా ఫామ్ అవుతుంది.

ఇది బాడీలోనే ఉండిపోతే అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్యను మొదట్లోనే తగ్గించుకోవాలి. యూరిక్ యాసిడ్‌ శరీరంలో పెరిగితే కీళ్ల సమస్యలు, గౌట్, అర్థరైటిస్ సమస్యలు వస్తాయి. మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. మూత్ర పిండాలు కూడా దెబ్బతింటాయి. ఇప్పటికే యూరిక్‌ యాసిడ్‌ని కంట్రోల్ చేసేవి ఎన్నో చిట్కాలు తెలుసుకున్నాం. జీలకర్ర కూడా యూరిక్ యాసిడ్‌ని కంట్రోల్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి జీలకర్రను ఎలా తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూద్దాం.

జీరా వాటర్:

జీలకర్రను మరిగించిన నీటిని తాగడం వల్ల ఎన్నో సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు. నీటిలో జీలకర్రను కనీసం ఓ రెండు గంటల పాటు అయినా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ నీటిని మరిగించి తీసుకుంటే యూరిక్ యాసిడ్ లెవల్స్ తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

నానబెట్టి తాగవచ్చు:

జీలకర్రను నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే లేచి తాగినా యూరిక్ యాసిడ్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. శరీరంలో పేరుకు పోయిన యూరిక్ యాసిడ్ బయటకు పోతుంది.

జీలకర్ర టీ:

జీలకర్రను టీ రూపంలో తీసుకున్నా కూడా ఈ సమస్య కంట్రోల్ అవుతుంది. ఓ కప్పున్నర నీటిని తీసుకుని అందులో ఆఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా మరిగించి తీసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా తాగితే సమస్య కంట్రోల్ అవుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.