Milk Purity Test: మీరు తాగేపాలు కల్తీవా? స్వచ్ఛమైనవా? ఇలా తెలుసుకోండి..

ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పాలల్లో పుష్కలంగా ఉంటాయి. అందుకే పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ఈ పానీయం సేవిస్తుంటారు. నేటి కాలంలో ప్రతి ఒక్కరి ఇంటికి పాలు రోజూ వస్తాయి. రోజువారీ అవసరాలకు అనుగుణంగా అవసరమైనన్ని పాలు తీసుకుంటూ ఉంటారు. కానీ మార్కెట్‌లో ఉన్న పాలన్నీ స్వచ్ఛమైనవని చెప్పలేం. పాలలో కల్తీ జరుగుతున్నట్లు ఇప్పటికే పలుచోట్ల ఎన్నో సంఘటనలు..

Milk Purity Test: మీరు తాగేపాలు కల్తీవా? స్వచ్ఛమైనవా? ఇలా తెలుసుకోండి..
Milk Purity Methods
Follow us

|

Updated on: May 26, 2024 | 12:20 PM

ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పాలల్లో పుష్కలంగా ఉంటాయి. అందుకే పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ఈ పానీయం సేవిస్తుంటారు. నేటి కాలంలో ప్రతి ఒక్కరి ఇంటికి పాలు రోజూ వస్తాయి. రోజువారీ అవసరాలకు అనుగుణంగా అవసరమైనన్ని పాలు తీసుకుంటూ ఉంటారు. కానీ మార్కెట్‌లో ఉన్న పాలన్నీ స్వచ్ఛమైనవని చెప్పలేం. పాలలో కల్తీ జరుగుతున్నట్లు ఇప్పటికే పలుచోట్ల ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. పాలను తరచుగా నీళ్లు, పిండి పదార్ధాల వంటి వాటితో కల్లీ చేస్తుంటారు. కాబట్టి మీరు కొనుగోలు చేసే పాలు ఎంత స్వచ్ఛమైనదో తెలుసుకోవడం చాలా అవసరం. దేశ ఆహార నియంత్రణ సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఈ మేరకు పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ద్వారా మీరు కొనుగోలు చేసిన పాలు ఎంత స్వచ్ఛమైనవో ఇంట్లోనే సులువుగా చెక్ చేసుకోవచ్చు.

నీటి కల్తీ పరీక్ష ఇలా..

పాల స్వచ్ఛతను కొలిచే మార్గాలలో నీటి కల్తీ పరీక్ష ఒకటి. ఈ పరీక్ష ఎలా చేస్తారంటే ఒక చుక్క పాలను ఓ ప్లేట్‌పై వేయండి. పాలు పూర్తిగా స్వచ్ఛంగా ఉంటే అది నెమ్మదిగా కిందికి జారుతుంది. అది జారినంత దూరం పాల రంగులో మరక ఉంటుంది. కానీ పాలలో నీరు కలిపితే, అది త్వరగా జారి కిందికి వస్తుంది. పైగా జారిన మార్గంలో తెల్లని పాల గుర్తుకు బదులు నీటి జాడలు కనిపిస్తాయి. ఎందుకంటే స్వచ్ఛమైన పాలకు ఉండే చిక్కదనం.. నీళ్లు కలిపిన పలుచన పాలలో ఉండదు. ఇలా ఈ వ్యత్యాసాన్ని సులువుగా గమనించవచ్చు.

స్టార్చ్ కల్తీ పరీక్ష

పాలలో ఏదైనా పొడి కలిపి కల్తీ చేసినట్లయితే.. ఇది తెలుసుకోవడానికి ఇంట్లో ఈ ట్రిక్‌ ట్రై చేయవచ్చు. తొలుత 4-5 మిల్లీలీటర్ల పాలను కాగబెట్టాలి. తర్వాత చల్లారనివ్వాలి. ఆ తర్వాత 2-3 చుక్కల అయోడిన్ ద్రావణాన్ని పాలపై వేయాలి. పాలు స్వచ్ఛంగా ఉంటే పాల రంగు మారదు. లేదంటే లేత పసుపు రంగులో కనిపిస్తుంది. కానీ పాలలో గంజి లేదా ఏదైనా ఇతర పిండి పదార్ధాలు కలిపితే పాల రంగు నీలం రంగులోకి మారుతుంది. దీన్నిబట్టి మీరు కొనుగోలు చేసిన పాలు స్వచ్ఛమైనదా, కల్తీ అయినదా అని సులభంగా అర్థం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్