10 రోజుల్లో మీ శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసుకోవాలంటే.. ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు ఈ జ్యూస్ తాగండి.!

మన వంటింట్లో లభించే మూలికలలో పుదీనా అత్యంత ప్రాముఖ్యమైనది. కేవలం వంటకాలకు రుచి, సువాసన ఇవ్వడమే కాకుండా, ఆయుర్వేదంలో దీనిని ఒక దివ్యౌషధంగా భావిస్తారు. ప్రతిరోజూ పుదీనా జ్యూస్ తాగడం వల్ల శరీరానికి లభించే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు, దానిని సులభంగా తయారుచేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

10 రోజుల్లో మీ శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసుకోవాలంటే.. ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు ఈ జ్యూస్ తాగండి.!
Mint Juice Benefits

Updated on: Sep 21, 2026 | 8:37 AM

పుదీనా కేవలం రుచి, సువాసనకే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలకు నిలయం. ప్రతిరోజూ ఉదయం లేదా క్రమం తప్పకుండా పుదీనా జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది కడుపు ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ సమస్యలను నివారిస్తుంది. పుదీనా ఆకులతో జ్యూస్ ఎలా తయారు చేస్తారు. కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం..

కావలసిన పదార్థాలు:

తాజా పుదీనా ఆకులు – 1 కప్పు

నిమ్మరసం – 1 స్పూన్

ఇవి కూడా చదవండి

తేనె లేదా బెల్లం – 1 స్పూన్ (తీపికి సరిపడా)

సైంధవ లవణం (నల్ల ఉప్పు) – చిటికెడు

జీలకర్ర పొడి – పావు స్పూన్

నీరు – 1 గ్లాసు

తయారీ విధానం:

ముందుగా పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి మిక్సీ జార్‌లో వేయాలి. అందులో ఒక గ్లాసు నీరు, నిమ్మరసం, సైంధవ లవణం, జీలకర్ర పొడి,యు తేనె వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టుకుని కావాలంటే నేరుగా గ్లాసులోకి తీసుకుంటే ఘుమఘుమలాడే తాజా పుదీనా జ్యూస్ సిద్ధమవుతుంది.

ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు:

జీర్ణక్రియ మెరుగుదల: పుదీనాలో ఉండే సమ్మేళనాలు జీర్ణరసాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఇది అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్, వికారం వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.

శరీరానికి తక్షణ ఉపశమనం: పుదీనాలోని మెంతోల్ శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, శరీరాన్ని చల్లబరుస్తుంది. ఎండదెబ్బ నుండి కాపాడుతూ, శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.

నోటి ఆరోగ్యం, తాజా శ్వాస: పుదీనాలో ఉండే యాంటీబాక్టీరియల్ గుణాలు నోట్లోని హానికరమైన బాక్టీరియాను నశింపజేస్తాయి. ఇది నోటి దుర్వాసనను పోగొట్టి, చిగుళ్లను దృఢంగా ఉంచుతుంది.

కాంతివంతమైన చర్మం: దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు రక్తంలో ఉన్న వ్యర్థాలను తొలగిస్తాయి. దీనివల్ల మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం సహజసిద్ధంగా మెరుస్తుంది.

బరువు నియంత్రణ, మానసిక ప్రశాంతత: కెలరీలు తక్కువగా ఉండే ఈ జ్యూస్ జీవక్రియను వేగవంతం చేసి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే పుదీనా సువాసన నరాలను ప్రశాంతపరిచి, మానసిక ఒత్తిడి, తలనొప్పిని తగ్గిస్తుంది. రోజువారీ ఆహారంలో ఈ పుదీనా జ్యూస్‌ను భాగం చేసుకోవడం ద్వారా ఇంట్లోనే సులభంగా పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us