Weight Loss: ఎన్ని కిలోల బరువు ఉన్నా.. ఇలా చేస్తే నెల రోజుల్లో మార్పు రావాల్సిందే!

|

Dec 03, 2024 | 3:12 PM

బరువు తగ్గాలని అందరికీ ఉంటుంది. కానీ ఆ బరువు తగ్గేందుకు ఏం చేయాలి అన్నది చాలా మందికి తెలీదు. కొన్ని రకాల టిప్స్ పాటించడం వల్ల ఎన్ని కిలోల బరువు ఉన్నా కంట్రోల్ చేసుకోవచ్చు..

Weight Loss: ఎన్ని కిలోల బరువు ఉన్నా.. ఇలా చేస్తే నెల రోజుల్లో మార్పు రావాల్సిందే!
Weight Loss
Follow us on

అధిక బరువు, ఊబకాయం అనేది ఈ రోజుల్లో పెద్ద సమస్యగా మారింది. శారీరక శ్రమ లేకుండా పని చేసేవారు ఈ సమస్యల బారిన పడుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మందికి ఇబ్బంది పెట్టే ప్రాబ్లమ్స్‌లో ఇవి కూడా ఒకటి. బరువు పెరగడం సులభమే. కానీ తగ్గడానికి ప్రయత్నిస్తే మాత్రం తల ప్రాణం తోకకు వస్తుంది. అధిక బరువు కారణంగా బీపీ, షుగర్, క్యాన్సర్, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు స్లిమ్‌గా ఫిట్‌గా ఉండేందుకే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కేవలం తినడం మానేసినంత మాత్రాన బరువు తగ్గిపోరు. ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. బరువు తగ్గడం కోసం చాలా మంది తినడం మానేసి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మనం ఇంట్లోనే ఇప్పుడు చెప్పే టిప్స్ ఫాలో చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ బరువు మార్పును మీరు గమనిస్తారు. ఎన్ని కిలోలు ఉన్నా నెల రోజుల్లోనే మీకు మార్పు కనిపించడం ఖాయం. మరి బరువు తగ్గేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తెల్లగా ఉండే ఆహారాలకు దూరం:

ముందుగా మీరు తినే ఆహారం మీద కంట్రోల్ తెచ్చుకోవాలి. తెల్లగా ఉండే వస్తువులను తినడం మానేయండి. పంచదార, ఉప్పు, మైదా, జంక్ పుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ‌తినడాన్ని పూర్తిగా తగ్గించండి. వీటికి బదులు ఇతర ప్రత్యామ్నాయలు ఆలోచించండి.

హెల్దీ ఫుడ్:

ఆరోగ్యకరమైన భోజనం తినండి. బయట ఫుడ్స్ కంటే ఇంట్లో తయారు చేసిన ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వండి. మీకు నచ్చినవి తినండి.. కానీ తక్కువగా తినడం అలవాటు చేసుకోండి. ఒకే సారి తినడం బదులు గంట లేదా రెండు గంటలకు ఒకసారి తినాలి. ఇలా తినడం వల్ల ఒకటేసారి జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పడదు. కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు, గుడ్లు వంటివి తినొచ్చు.

ఇవి కూడా చదవండి

వ్యాయామం:

మీరు బరువు తగ్గేందుకు వ్యాయామం ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. మీకు మంచి రిజల్ట్ రావాలంటే.. ఉదయం, సాయంత్రం రెండు పూటలా కూడా వ్యాయామానికి సమయం కేటాయించండి. వ్యాయమాలు చేయలేని వారు వాకింగ్ చేసినా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి.

నీటిని ఎక్కువగా తీసుకోండి:

బరువు తగ్గడంలో నీరు బాగా హెల్ప్ చేస్తుంది. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు కనీసం 4 లీటర్ల నీటిని అయినా తాగాలి. అలాగే వాష్ రూమ్‌కి వెళ్లడం కూడా ముఖ్యం. మల, మూత్ర విసర్జనను ఆపుకోకండి. ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా బరువు తగ్గుతారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..