AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళికి వరి పేలాలు మిగిలిపోయాయా? కేవలం 2 నిమిషాల్లో కమ్మటి బర్ఫీ తయారు చేసుకోండిలా..

దీపావళి పండుగ పూజల కోసం తెచ్చిన వరి పేలాలు ఇంట్లో మిగిలిపోతే వాటితో అద్భుతమైన స్వీట్ తయారు చేసుకోవచ్చు. దీనికోసం గ్యాస్ వెలిగించాల్సిన అవసరం కూడా లేదు. కేవలం రెండు నిమిషాల్లో ఎలాంటి ఖోవా, పాకం, నెయ్యి లేకుండా ఈ టేస్టీ బర్ఫీని తయారు చేయవచ్చు. మిగిలిపోయిన మరమరాలు, పంచదార, మిల్క్ పౌడర్, కొబ్బరి పొడి, కొద్దిగా తాజా మీగడను ఉపయోగించి దీన్ని సులభంగా చేయవచ్చు. ఈ స్వీట్ చూడటానికి బర్ఫీలా, తినడానికి మిల్క్ కేక్, కలాకండ్‌ రుచిని ఇస్తుంది. తక్కువ ఖర్చుతో, ఎంతో రుచికరంగా ఇంట్లోనే తక్షణమే చేసుకునే ఈ సరికొత్త రెసిపీ గృహిణులకు ఎంతో ఉపయోగపడుతుంది.

దీపావళికి వరి పేలాలు మిగిలిపోయాయా? కేవలం 2 నిమిషాల్లో కమ్మటి బర్ఫీ తయారు చేసుకోండిలా..
Leftover Murmura Recipe
Jyothi Gadda
|

Updated on: Nov 09, 2026 | 4:25 PM

Share

దీపావళి పండుగ అనగానే దీపాలు, పటాకులు, స్వీట్లతో పాటు లక్ష్మీ పూజలో ఉపయోగించే వరి పేలాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. పూజ అయిన తర్వాత చాలా ఇళ్లలో ఈ మరమరాలు మిగిలిపోతుంటాయి.. ఏం చేయాలో తెలియక చాలామంది వాటిని పక్కన పడేస్తుంటారు. అయితే, ఈ బద్ధకాన్ని వదిలేసి ఆ మిగిలిన వాటితో ఎంతో రుచికరమైన, నోట్లో వెన్నలా కరిగిపోయే మరమరాల బర్ఫీని తయారు చేసుకోవచ్చు. ప్రత్యేకత ఏమిటంటే, దీనికి గ్యాస్ స్టవ్ వెలిగించాల్సిన అవసరం కూడా లేదు. కేవలం రెండు నిమిషాలలో ఎటువంటి ఖోవా, పాకం లేకుండా దీన్ని సులభంగా తయారు చేయవచ్చు.

కావలసిన పదార్థాలు:

మిగిలిపోయిన వరి పేలాలు – 2 కప్పులు

పంచదార – అర కప్పు

ఇవి కూడా చదవండి

యాలకులు – 2 లేదా 3

మిల్క్ పౌడర్ – అర కప్పు

ఎండు కొబ్బరి పొడి – పావు కప్పు

తాజా మీగడ – 3 నుండి 4 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం:

మొదటగా మిక్సీ జార్‌లో అర కప్పు పంచదార, 2-3 యాలకులు వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే జార్‌లో రెండు కప్పుల మరమరాలు వేసి మెత్తగా పౌడర్ చేసి జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పొడి, మరమరాల పౌడర్, మిల్క్ పౌడర్, కొబ్బరి పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పొడి మిశ్రమంలో కొద్ది కొద్దిగా తాజా మీగడను కలుపుతూ చపాతీ పిండిలా లేదా సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలి. మిశ్రమం మరీ గట్టిగా లేదా మరీ పల్చగా కాకుండా చూసుకోవాలి.

తయారైన ఈ మిశ్రమాన్ని ఒక కేక్ టిన్ లేదా ట్రేలో వేసి సమానంగా ఒత్తుకోవాలి. పైన కొద్దిగా సన్నగా తరిగిన పిస్తా లేదా బాదం ముక్కలు చల్లుకోవాలి. ఆ తర్వాత దీన్ని 5 నుండి 10 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో సెట్ అవ్వడానికి ఉంచాలి. సరిగ్గా గడ్డకట్టిన తర్వాత మీకు నచ్చిన ఆకారంలో లేదంటే డైమండ్ షేప్ కట్ చేసుకుంటే సరిపోతుంది.

ఈ స్వీట్ చూడటానికి మార్కెట్లో కొనే ఖరీదైన బర్ఫీలా కనిపిస్తుంది. తింటుంటే అచ్చం మిల్క్ కేక్, కలాకండ్‌ స్వీట్ కలగలిపిన అద్భుతమైన రుచిని అందిస్తుంది. పండుగ పూట మిగిలిపోయిన వస్తువులతో ఇలాంటి సరికొత్త రెసిపీ ట్రై చేయడం ద్వారా మీ ఇంటి సభ్యులందరి ప్రశంసలు అందుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఓటీటీలోకి రణబాలి.. ఎక్కడ.? ఎప్పుడు చూడొచ్చంటే
ఓటీటీలోకి రణబాలి.. ఎక్కడ.? ఎప్పుడు చూడొచ్చంటే
వామ్మో.. టీమిండియా టూర్ లేక రూ.627 కోట్ల నష్టమా..?
వామ్మో.. టీమిండియా టూర్ లేక రూ.627 కోట్ల నష్టమా..?
దీపావళికి మరమరాలు మిగిలిపోయాయా? కమ్మటి బర్ఫీ తయారు చేసుకోండిలా..
దీపావళికి మరమరాలు మిగిలిపోయాయా? కమ్మటి బర్ఫీ తయారు చేసుకోండిలా..
రాహుల్‌లో ఆ ఒక్క లక్షణం భలే నచ్చింది.. కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రాహుల్‌లో ఆ ఒక్క లక్షణం భలే నచ్చింది.. కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
3 రాష్ట్రాలు.. 3 భాషలు.. 2 నదులు.. ఆంధ్రా సరిహద్దుల్లోని ఈ అద్భుత
3 రాష్ట్రాలు.. 3 భాషలు.. 2 నదులు.. ఆంధ్రా సరిహద్దుల్లోని ఈ అద్భుత
రూ.10తో ఈ కార్డు తీసుకుంటే ప్రతీ నెలా రూ.10 వేలు..
రూ.10తో ఈ కార్డు తీసుకుంటే ప్రతీ నెలా రూ.10 వేలు..
ఇరాన్‌కు ఆయుధాల సరఫరా కట్‌ చేసేందుకు అమెరికా కొత్త వ్యూహం!
ఇరాన్‌కు ఆయుధాల సరఫరా కట్‌ చేసేందుకు అమెరికా కొత్త వ్యూహం!
విదేశీ ఎయిర్‌పోర్టులో భారతీయుల బంతి భోజనాలు.. పారిశ్రామికవేత్త
విదేశీ ఎయిర్‌పోర్టులో భారతీయుల బంతి భోజనాలు.. పారిశ్రామికవేత్త
హార్దిక్ పాండ్యా వెళ్లిపోతే ముంబైకి నష్టం కంటే లాభమే ఎక్కువట
హార్దిక్ పాండ్యా వెళ్లిపోతే ముంబైకి నష్టం కంటే లాభమే ఎక్కువట
క్యాన్సర్ బాధితులకు బిగ్ రిలీఫ్.. 137 రకాల మందుల ధరలు 96శాతం..
క్యాన్సర్ బాధితులకు బిగ్ రిలీఫ్.. 137 రకాల మందుల ధరలు 96శాతం..