AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుక్కర్ లో పొరపాటున కూడా ఈ వస్తువులను వంట చేయవద్దు.. అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే..

ఇప్పటి బిజీ లైఫ్ లో పనులన్నీ త్వరగా త్వరగా చేసుకోవాలని భావిస్తున్నారు. వంట కూడా ఎంత త్వరగా అయిపోతే అంత సమయం మిగులుతుంది..మరొక పని చేసుకోవచ్చు అని భావిస్తున్నారు. దీంతో వంట కోసం ప్రెషర్ కుక్కర్‌ని ఆశ్రయిస్తున్నారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్ధాలను కుక్కర్ లో వండటం వల్ల రుచి చెడిపోవడమే కాదు ఆరోగ్యానికి కూడా హానికరం. కనుక ఈ రోజున పొరపాటున కూడా కుక్కర్‌లో ఏ వస్తువులను వండకూడదో తెలుసుకుందాం.

కుక్కర్ లో పొరపాటున కూడా ఈ వస్తువులను వంట చేయవద్దు.. అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే..
Cooker TipsImage Credit source: Shutterstock
Surya Kala
|

Updated on: May 22, 2025 | 11:03 AM

Share

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రెషర్ కుక్కర్ లేని వంటగది కనిపించడం అసాధ్యం. తక్కువ సమయంలో సులభంగా వంట చేసుకునేందుకు కుక్కర్ ని ఉపయోగిస్టారు. దీంతో వంటగదిలో అత్యంత ముఖ్యమైన పాత్రల్లో కుక్కర్ ఒకటి. వంట చేయడానికే కాదు దీనిని ఆహారం ఆవిరి మీద ఉడికించడానికి, బేకింగ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. కుక్కర్ లో కేకుల తయారీ కూడా గత కొంత కాలంగా ఎక్కువగా చేస్తున్నారు. అయితే కొన్ని రకాల ఆహారపదార్ధాలను కుక్కర్‌లో చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని మీకు తెలుసా.

నిజానికి కొన్ని ఆహార పదార్థాలను వండే సమయంలో నురుగు బయటకు వస్తుంది. అవి కుక్కర్ లో చేయడం వలన ఆ నురుగు శరీరానికి చేరి జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంది.

ఇది మాత్రమే కాదు ప్రెషర్ కుక్కర్‌లో వండినట్లయితే.. వాటి రుచి చెడిపోతుంది. అవి శరీరానికి కూడా హాని కలిగిస్తాయి. ప్రెషర్ కుక్కర్‌లో కొన్ని వస్తువులను వండటం వల్ల వాటి పోషకాలు కూడా తగ్గుతాయి. ఈ రోజు కుక్కర్ లో చేయకూడని వస్తువులు ఏమిటో తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

ఈ ఐదు వస్తువులను ప్రెజర్ కుక్కర్‌లో ఎప్పుడూ ఉడికించవద్దు

ప్రెజర్ కుక్కర్‌లో పాలు మరిగించవద్దు పాలు, క్రీమ్ వంటి పాల ఉత్పత్తులను ప్రెజర్ కుక్కర్‌లో అస్సలు వండకూడదు. ఇలా చేయడం వల్ల వాటి రుచి చెడిపోతుంది. పోషకాలు కూడా తగ్గుతాయి. ఇలా కుక్కర్ లో కాచిన పాలు ఆరోగ్యానికి హాని కరం. పాలు వేడి చేయడం సులభం అయినా సరే కొంతమంది పాలను కుక్కర్ లో వేడి చేస్తున్నారు. పైగా పాలను వేడి చేసేందుకు స్పెషల్ కుక్కర్లు మార్కెట్ లో లభిస్తున్నాయి. అయినా సరే ఇలా వేడి చేసిన పాలు ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం కావచ్చు.

కుక్కర్ లో వేయించిన పదార్థాలను ఉడికించవద్దు.

ఫ్రెంచ్ ఫ్రైస్, పకోడీలు వంటి వేయించాల్సిన ఆహార పదార్థాలను కుక్కర్‌లో వండకూడదు. వేయించిన వీటిని ప్రెజర్ కుక్కర్‌లో ఆవిరి మీద ఉడికిస్తే కరకరలాడే అనుభూతిని ఇవ్వదు. ఎందుకంటే వీటిని కుక్కర్‌లో డీప్ ఫ్రై చేయలేరు.ఇలా చేయడం వల్ల వాటికి మంచి రుచి రాదు. అందుకే వీటిని ఎప్పుడూ కుక్కర్ లో తయారు చేసుకోవద్దు. అంతేకాదు అధిక నూనెతో వంటలు చేయడం వలన పేలుడు సంభవించే ప్రమాదం ఉంది. ఎందుకంటే కుక్కర్ సీల్ మరియు భద్రతా విధానాలు అధిక ఉష్ణోగ్రత ప్రతిచర్యలను తట్టుకోలేవు.

ప్రెజర్ కుక్కర్‌లో పాస్తా , నూడుల్స్ వండ వద్దు

పాస్తా, నూడుల్స్ త్వరగా ఉడికించవచ్చు. ఇవి ఉడికిన తర్వాత మెత్తగా అవుతాయి.కనుక వీటిని ఎప్పుడూ ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించకూడదు . అవి ఎక్కువగా ఉడికితే.. మెత్తం పేస్ట్ లా మారతాయి. అందువల్ల వీటిని ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించవద్దు.

కుక్కర్‌లో ఆకుకూరలను ఉడికించవద్దు.

పాలకూర, కాలే వంటి ఆకుకూరలను కుక్కర్‌లో ఎప్పుడూ ఉడికించకూడదు. ఎందుకంటే ఆకుకూరల్లో విటమిన్ సి, ఐరన్, కాల్షియం, విటమిన్ ఎ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అయితే ప్రెజర్ కుక్కర్‌లో వీటిని ఉడికించడం వల్ల ముఖ్యమైన పోషక పదార్థాలు తగ్గుతాయి. ఇది ఆరోగ్యానికి హానికరం.

ప్రెజర్ కుక్కర్‌లో కేక్ కాల్చడం సరైనది కాదు. తరచుగా ప్రజలు ఓవెన్ లేకపోతే ప్రెషర్ కుక్కర్‌లో కేక్ ని తయారు చేస్తున్నారు. అయితే ఇలా చేయడం పూర్తిగా తప్పు ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ అనేది వంట కోసం తయారు చేయబడింది. బేకింగ్ కోసం కాదు. కనుక కుక్కర్ లో కేక్ ఎప్పుడూ కాల్చకూడదు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us