AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీన్స్ రంగు వెలిసిపోవడానికి అసలు కారణం ఇదే.. మీరు కూడా ఇదే తప్పు చేస్తున్నారా?

జీన్స్ రంగు త్వరగా వెలిసిపోవడం చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. అయితే ఉతికే విధానంలో కొన్ని చిన్న మార్పులు చేస్తే డెనిమ్ జీన్స్‌ను ఎక్కువకాలం కొత్తవిగా ఉంచుకోవచ్చు. చల్లటి నీరు, తేలికపాటి డిటర్జెంట్, సరైన ఆరబెట్టే పద్ధతి వంటి చిట్కాలు జీన్స్ నాణ్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి..

జీన్స్ రంగు వెలిసిపోవడానికి అసలు కారణం ఇదే.. మీరు కూడా ఇదే తప్పు చేస్తున్నారా?
Jeans Washing Tips
Srilakshmi C
|

Updated on: Jun 12, 2026 | 8:06 PM

Share

డెనిమ్ జీన్స్ అనేది దాదాపు ప్రతి ఒక్కరి వార్డ్‌రోబ్‌లో ఉండే ఫ్యాషన్ దుస్తి. సౌకర్యంతో పాటు స్టైలిష్ లుక్‌ను అందించే జీన్స్‌ను యువత నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. అయితే ఎంత ఖరీదైన జీన్స్ కొనుగోలు చేసినా, కొంతకాలానికే వాటి రంగు వెలిసిపోవడం, పాతవిగా కనిపించడం సాధారణంగా కనిపించే సమస్య. దీనికి జీన్స్ నాణ్యత మాత్రమే కాకుండా, వాటిని ఉతికే విధానం కూడా ప్రధాన కారణం. జీన్స్ ఎక్కువకాలం కొత్తవిగా కనిపించాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

లోపలి వైపుకు తిప్పి ఉతకండి

డెనిమ్ జీన్స్‌ను ఎల్లప్పుడూ లోపలి వైపుకు తిప్పి ఉతకడం మంచిది. ఇలా చేయడం వల్ల బయట ఉన్న రంగు నేరుగా నీరు, డిటర్జెంట్ ప్రభావానికి గురికాకుండా ఉంటుంది. ఫలితంగా రంగు త్వరగా వెలిసిపోకుండా కాపాడుకోవచ్చు.

చల్లటి నీటినే ఉపయోగించండి

చాలామంది వేడి నీటితో బట్టలు ఉతుకుతుంటారు. కానీ జీన్స్ విషయంలో ఇది సరైన పద్ధతి కాదు. వేడి నీరు డెనిమ్ ఫ్యాబ్రిక్‌పై ప్రభావం చూపి రంగు త్వరగా మసకబారేలా చేస్తుంది. అందుకే జీన్స్‌ను ఎల్లప్పుడూ చల్లటి నీటితో ఉతకడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

ఎక్కువగా రుద్దొద్దు

జీన్స్‌ను గట్టిగా రుద్దడం, పిండడం వంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఫ్యాబ్రిక్ దెబ్బతిని, జీన్స్ త్వరగా పాతబడినట్లు కనిపిస్తుంది. కాబట్టి డెనిమ్‌ను సున్నితంగా ఉతకడం మంచిది.

తేలికపాటి డిటర్జెంట్ వాడండి

కఠినమైన రసాయనాలు ఉన్న డిటర్జెంట్లు డెనిమ్ నాణ్యతను దెబ్బతీస్తాయి. అందువల్ల తేలికపాటి డిటర్జెంట్‌ను మాత్రమే ఉపయోగించాలి. మరకలు ఉన్న చోట మాత్రమే డిటర్జెంట్ రాసి శుభ్రం చేయడం మంచిది. మొత్తం జీన్స్‌పై ఎక్కువ డిటర్జెంట్ వాడటం మానుకోవాలి.

ఆరబెట్టే విధానం కూడా కీలకం

జీన్స్‌ను నేరుగా ఎండలో ఆరబెట్టడం వల్ల రంగు వేగంగా వెలిసిపోతుంది. అందువల్ల వాటిని ఎల్లప్పుడూ గాలి బాగా వచ్చే నీడ ప్రాంతంలో ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల జీన్స్ రంగు, నాణ్యత ఎక్కువకాలం నిలిచి ఉంటాయి.

ప్రతి వాడకం తర్వాత ఉతకాల్సిన అవసరముందా?

ఫ్యాషన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీన్స్‌ను ప్రతిసారి ధరించిన తర్వాత ఉతకాల్సిన అవసరం లేదు. తరచుగా ఉతకడం వల్ల డెనిమ్ ఫ్యాబ్రిక్ త్వరగా పాడైపోతుంది. సాధారణంగా 4 నుంచి 5 సార్లు ధరించిన తర్వాత ఉతకడం మంచిది. అలాగే వాడిన తర్వాత కొంతసేపు గాలి తగిలే ప్రదేశంలో ఉంచితే దుర్వాసన తగ్గి, తరచుగా ఉతకాల్సిన అవసరం కూడా ఉండదు. సరైన పద్ధతిలో జీన్స్‌ను ఉతికితే వాటి రంగు, నాణ్యత ఎక్కువకాలం నిలిచి ఉంటాయి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీకు ఇష్టమైన డెనిమ్ జీన్స్‌ను కొత్తవిగా ఉంచుకోవచ్చు.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర