
ఇటీవలి రోజుల్లో జుట్టు రాలడం, చుండ్రు, బలహీనమైన జుట్టు సమస్యలు సర్వసాధారణమైపోయాయి. ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, ధూళి, కాలుష్యం, జుట్టుకు రసాయన ఉత్పత్తులను ఎక్కువగా వాడటం జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి చాలామంది ఖరీదైన షాంపూలు, ట్రీట్‌మెంట్‌లను ట్రై చేస్తారు. కానీ ఇంట్లో దొరికే ఒక్క పెరుగుతూ ఈ సమస్యలు అన్నింటినీ దూరం చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. అవును స్నానాని ముందు పెరుగును కాస్త జుట్టుకు రాసుకొని కాసేపు ఉంచి తర్వాత కడిగేస్తే.. చాలూ ఇది జుట్టుకు పోషణను అందించడంతో పాటు స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి జుట్టుకు పెరుగు రాయడం వల్ల కలిగే ప్రయోజనాలు, దానిని ఉపయోగించే సరైన విధానం గురించి తెలుసుకుందాం.
జుట్టుకు పెరుగు రాయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
స్కాల్ప్‌ను శుభ్రపరుస్తుంది: పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది స్కాల్ప్ నుండి మురికి, చెమట, అదనపు నూనెను తొలగించడానికి సహాయపడుతుంది. ఇది రోమ రంధ్రాలను తెరిచి, జుట్టు ఎదుగుదలను మెరుగుపరుస్తుంది. శుభ్రమైన స్కాల్ప్ జుట్టు వేర్లను బలోపేతం చేస్తుంది.
జుట్టును బలంగా, ఒత్తుగా మార్చుతుంది: పెరుగులోని ప్రొటీన్లు, విటమిన్లు జుట్టు వేర్లకు పోషణను అందిస్తాయి. ఇది జుట్టు విరగడాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే బయోటిన్, జింక్ జుట్టును వేర్ల నుండి బలోపేతం చేస్తాయి, దీనివల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
చుండ్రు, దురదను నివారిస్తుంది: మీరు చాలా కాలంగా చుండ్రు, దురద సమస్యతో బాధపడుతుంటే, స్నానానికి ముందు స్కాల్ప్‌కు కాసేపు పెరుగు రాయండి. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు స్కాల్ప్ మంటను తగ్గించి, చుండ్రును అదుపు చేయడంలో సహాయపడతాయి.
సహజమైన కండిషనర్: జుట్టుకు పెరుగు రాయడం వల్ల మెత్తటి, మెరిసే జుట్టును మీరు పొందవచ్చు. దీనిని క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు ఆకృతి మెరుగవుతుంది. అలాగు జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది.
జుట్టుకు పెరుగును అప్లై చేయడానికి సరైన పద్ధతి ఏది?
మొదట ఒక గిన్నెలో తాజా పెరుగు తీసుకోండి. అందులో కొంచెం అలోవెరా జెల్ లేదా మెంతుల పొడిని కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్, జుట్టుకు పూర్తిగా అప్లై చేసి, సుమారు 20 నుండి 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును కడుక్కోండి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తే కొన్ని రోజుల్లోనే మీరు మార్పును చూస్తారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.