Heart Stroke: గుండెపోటుతో ఉద్యోగ జీవితం గాడి తప్పిందా? ఈ టిప్స్‌తో మునుపటికంటే మెరుగ్గా..

|

Nov 01, 2022 | 3:52 PM

మన భారతదేశంలో గుండెపోటు ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్య. ప్రత్యేకించి 2000 సంవత్సరం నుంచి వార్షిక్ స్ట్రోక్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అధిక ఒత్తిడి, ఇతర కారణాలు..

Heart Stroke: గుండెపోటుతో ఉద్యోగ జీవితం గాడి తప్పిందా? ఈ టిప్స్‌తో మునుపటికంటే మెరుగ్గా..
Heart Stroke
Follow us on

మన భారతదేశంలో గుండెపోటు ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్య. ప్రత్యేకించి 2000 సంవత్సరం నుంచి వార్షిక్ స్ట్రోక్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అధిక ఒత్తిడి, ఇతర కారణాలు ఈ స్ట్రోక్‌కు కారణమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ స్ట్రోక్ కారణంగా వివిధ వయసుల వ్యక్తులు ప్రభావితం అవుతున్నారు. అయితే, 30 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల వారిలో చాలా మంది ప్రజలు ఈ స్ట్రోక్‌కు గురవుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. స్ట్రోక్ కండరాల బలం, నడక సామర్థ్యం, ​సమతుల్యత, మాట్లాడే శక్తి, మూత్రాశయం నియంత్రణను ప్రభావితం చేస్తుంది. మానసిక సమస్యలకు కూడా దారితీస్తుంది. కొంత మేరకు స్వతంత్రతను కూడా కోల్పోయే అవకాశం ఉంది. స్ట్రోక్ కేర్‌లో పురోగతి ఉన్నప్పటికీ, స్ట్రోక్ ఉన్న వ్యక్తికి పునరావాసం కల్పించడంలో సవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. ఈ కారణంగా దీర్ఘకాలిక ప్రభావాలను తగ్గించడానికి, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి స్ట్రోక్ సమస్య ఉన్న వ్యక్తులకు సకాలంలో, సరైన చికిత్స అందించడం చాలా ముఖ్యం.

అయితే, స్ట్రోక్ తర్వాత ఒక వ్యక్తి అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం సహజం. వారు తమ ఉద్యోగంలో చేరిన తరువాత ఇంతకు ముందు ఉన్న విశ్వాసం వారిపై ఉండదు. తరచుగా వారి విధులను నిర్వర్తించడంలో సపోర్ట్ కోసం అడిగే ధైర్యం ఉండదు. అయితే, అలాంటివేవీ పట్టించుకోకుండా.. ఎవరైతే బాధిత ఉద్యోగులు ఉంటారో.. వారు తమ అవసరాల గురించి ఇతరులకు తప్పక చేప్పాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే, స్ట్రోక్‌కు గురైన తరువాత.. తిరిగి ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సూచనలు తప్పక పాటించాల్సి ఉంటుంది. నిపుణులు చెబుతున్న ఆ సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ప్రతిరోజూ కార్యాలయానికి వెళ్లలేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలి.

ఇవి కూడా చదవండి

2. శరీరం మరీ ఒత్తిడికి గురవకుండా చూసుకోవాలి. ఎన్ని గంటల పని చేయగలరో అన్ని గంటలు మాత్రమే పని చేయాలి.

3. ఉద్యోగ వివరణకు అనుగుణంగా మీరు చేయగలిగే, చేయలేని పనుల జాబితాను రూపొందించుకోవాలి. ఇదే విషయాన్ని మేనేజర్‌తో చర్చించాలి.

4. ఏదైనా కార్యాచరణ సమస్యలను సులభతరం చేయడానికి, బాధ్యతలను పంచుకోవడానికి, అవసరమైతే టాస్క్‌లను అప్పగించడానికి మీ బృందంతో సమీక్షలు జరుపాలి.

5. ముఖ్యంగా ఉద్యోగానికి వెళ్లిన ప్రభావిత వ్యక్తికి సంబంధించి స్ట్రోక్, మందులు, మానసిక స్థితి ప్రభావాలపై వారి మేనేజర్‌తో స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి.

అయితే, ఇక్కడ మరో కీలక అంశం ఉంది. చాలా సందర్భాల్లో స్ట్రోక్‌కు గురైన వ్యక్తి సమస్యలను, ఆ వ్యక్తి ఆరోగ్యాన్ని మానిటరింగ్ చేయడానికి, వారికి అవసరమైన సపోర్ట్ ఇవ్వడానికి కంపెనీలు సన్నద్ధంగా ఉండవు. అయితే, స్ట్రోక్‌తో బాధపడే వారికి సురక్షితమైన వర్క్ స్పేస్ రూపొందించడంలో సహాయపడే బ్యాక్ టు వర్క్ ప్రోగ్రామ్‌లో అనుసరించాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ అంశాలేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఎర్గోనామిక్ వర్క్‌స్టేషన్‌లు, స్టాండ్-సిట్టింగ్ డెస్క్‌లు వంటి పరికరాలు అవసరం అవుతాయి.

2. స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ మాట్లాడటంలో ఇబ్బంది పడుతున్న రోగులకు సహాయపడుతుంది.

3. కంపెనీ సెలవు విధానాలను సమీక్షించడం, తద్వారా ఉద్యోగి అపరాధ భావాలు లేకుండా లేదా ఎలాంటి ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోకుండా వ్యక్తిగత సమయాన్ని కేటాయించవచ్చు.

4. అనువైన పని గంటలు, నమూనాలు, అవసరమైతే శాశ్వతంగా ఇంటి నుండి పని చేయడానికి ఉద్యోగులను అనుమతి ఇవ్వడం.

5. మరీ ముఖ్యంగా, స్ట్రోక్ తర్వాత పనికి తిరిగి వస్తున్న ఉద్యోగితో కమ్యూనికేట్ చేయడం చాలా అనువుగా ఉంటుంది.

నిపుణుల ప్రకారం.. ఒక సారి స్ట్రోక్‌కు గురైతే ఆరోగ్య జీవితం పెద్దగా ప్రభావితం అవ్వదు. కానీ, పని చేసే ప్రాంతంలో సహోద్యోగులు, యజమాన్యం వారికి సహకరిస్తే, సమయన్వయంతో పని చేస్తే బాధిత వ్యక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అది క్రమంగా మెరుగైన భావోద్వేగ శ్రేయస్సు, అధిక ఉత్పాదకతను దారి తీస్తుంది. ఈ సమస్యను భయం, అయిష్టత దృష్టితో చూసే బదులు.. జాలి, కరుణతో పరిష్కరిస్తే అందరికీ మంచి జరుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..