Hair Care Tips: షాంపూ తర్వాత జుట్టు పొడిగా మారుతుందా.. మృదువైన, మెరిసే జుట్టు కోసం ఈ టిప్స్ పాటించి చూడండి

|

Oct 20, 2024 | 8:51 PM

షాంపూ చేసిన తర్వాత జుట్టు పొడిగా మారుతుంది.. మృదువైన, మెరిసే జుట్టును పొందడానికి ప్రజలు అనేక రకాల రసాయన చికిత్సలను ప్రయత్నిస్తారు. ఇలా రసాయనాలు ఉపయోగించడం వలన జుట్టు కూడా చాలా పాడైపోతుంది. ప్రస్తుతం జుట్టు షాంపూ చేసిన తర్వాత జుట్టు చిట్లిపోయి, పొడిగా మారినట్లయితే.. జుట్టు అందం కోసం కొన్ని సింపుల్ చిట్కాలను పాటించవచ్చు. ఇలా చూసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

Hair Care Tips: షాంపూ తర్వాత జుట్టు పొడిగా మారుతుందా.. మృదువైన, మెరిసే జుట్టు కోసం ఈ టిప్స్ పాటించి చూడండి
Hair Care Tips
Follow us on

మృదువైన, మెరిసే జుట్టును ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. దీంతో అనేక రకాల చికిత్సలను కూడా ఆశ్రయిస్తారు. ఈ చికిత్సలు చాలా ఖరీదైనవి అయినప్పటికీ.. అవి శాశ్వత పరిష్కారం కాదు. ఎందుకంటే కొన్ని నెలల తర్వాత చికిత్స ప్రభావం తగ్గిపోతుంది. అప్పుడు మళ్లీ చేయవలసి ఉంటుంది. కొందరికి షాంపూ చేసిన తర్వాత జుట్టు చాలా పొడిబారడం మొదలవుతుంది. శీతాకాలంలో చుండ్రు పెరిగినప్పుడు ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. అటువంటి పరిస్థితిలో జుట్టును సరిగ్గా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజు మృదువైన, మెరిసే జుట్టు కోసం సింపుల్ చిట్కాలు తెలుసుకుందాం..

జుట్టు పొడిబారినట్లుగా, మందంగా ఉంటె లుక్ బాగుండదు. అందుకే ప్రజలు మృదువైన, మెరిసే జుట్టు కోసం చాలా పనులు చేస్తారు. అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే పొడి జుట్టు, చిట్లిన జుట్టు కూడా పట్టు కుచ్చు వలెనే మృదువుగా మారుతుంది.

నూనె అప్లై చేయండి
షాంపూ చేసిన తర్వాత జుట్టు పొడిబారినట్లు, చిక్కులు పడితే జుట్టుని శుభ్రం చేసుకోవడానికి కనీసం ఒక గంట ముందు జుట్టుకు పూర్తిగా నూనె రాయడం అలవాటు చేసుకోండి. దీని కోసం మీరు ఆలివ్ నూనె, కొబ్బరి నూనె లేదా ఆవాల నూనెను కూడా ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

కండీషనర్ చేయడం మర్చిపోవద్దు
జుట్టు చిట్లకుండా ఉండటానికి షాంపూ తర్వాత కండిషన్ చేయాలి. దీని కోసం ఇంట్లో కూడా కండీషనర్ సిద్ధం చేసుకోవచ్చు. తాజా కలబంద జెల్ తీసుకొని, కొన్ని చుక్కల కొబ్బరి నూనె, తేనె వేసి, బ్లెండ్ చేసి షాంపూ చేసిన తర్వాత అప్లై చేసి కనీసం 15 నిమిషాలు ఉంచండి. అప్పుడు జుట్టుని మళ్ళీ శుభ్రం చేసుకోవాలి.

జుట్టు రకాన్ని బట్టి షాంపూని ఎంచుకోండి
కొన్నిసార్లు కఠినమైన షాంపూ కారణంగా జుట్టు పొడిబారడం, చిక్కులు పడడం జరుగుతుంది. కనుక షాంపూని ఉపయోగించే ముందు షాంపులోని పదార్థాలపై శ్రద్ధ వహించండి. జుట్టుకు తేమను అందించడంలో సహాయపడే షాంపూని తీసుకోండి. దీని కోసం కావాలంటే హెర్బల్ షాంపూని ప్రయత్నించవచ్చు.

వారానికి ఒకసారి ఈ హెయిర్ మాస్క్‌ని అప్లై చేయండి
మృదువైన, మెరిసే జుట్టును పొందడానికి వారానికి ఒకసారి హెయిర్ మాస్క్‌ను అప్లై చేయండి. ఇది మీ జుట్టును మృదువుగా మార్చడమే కాకుండా చుండ్రు, జుట్టు రాలడం వంటి అనేక ఇతర జుట్టు సంభదిత సమస్యల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. దీని కోసం గుడ్డు, పెరుగు మిక్స్ చేసి అప్లై చేయవచ్చు లేదా అరటిపండు, పెరుగు, తేనె మిక్స్ చేసి హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు.

హెయిర్ సీరమ్ అప్లై చేయడం వల్ల ప్రయోజనం
జుట్టు ఎప్పుడూ చిట్లినట్లు, నిర్జీవంగా కనిపిస్తే షాంపూ చేసిన తర్వాత హెయిర్ సీరమ్‌ను అప్లై చేయవచ్చు. దీనితో జుట్టు క్రమంగా ఆరోగ్యంగా మారుతుంది. మెరుస్తూ ఉంటుంది. నిజానికి సీరం జుట్టుపై ఒక సేఫ్టీ లేయర్‌ను సృష్టిస్తుంది. జుట్టు పాడవకుండా కాపాడుతుంది.

 

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

(Note: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.)