Fox Nuts Farming: మఖానా సాగుతో అన్నదాతకు కాసుల వర్షం.. ఈ సాగు చేపల చెరువులో చేయవచ్చు.. పూర్తి వివరాలు

|

May 11, 2023 | 11:02 AM

మిథిలాంచల్‌తో పాటు బీహార్‌లోని ఇతర జిల్లాలు కూడా మఖానా హబ్‌గా అభివృద్ధి చెందుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇతర జిల్లాల్లోని రైతులు భారీగా మఖానా సాగు చేస్తున్నారు. మఖానా సాగుతో రైతులు మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. దీంతో రైతులు తమ జీవన ప్రమాణాలు మెరుగుపరచుకుంటున్నారు. 

Fox Nuts Farming: మఖానా సాగుతో అన్నదాతకు కాసుల వర్షం.. ఈ సాగు చేపల చెరువులో చేయవచ్చు.. పూర్తి వివరాలు
Makhana Farming
Follow us on

అందానికి అందం.. ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారపదార్ధాల్లో ఒకటి పూల్ మఖనా. నిజానికి ఇవి తామర గింజలు.. అయితే పూల్ మఖనాగా ఫేమస్ అయ్యాయి. మఖానా ఉత్పత్తిలో బీహార్ లోని మిథిలాంచల్‌ ప్రాంతం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. మిథిలాంచల్‌లోని మఖానాకు జిఐ ట్యాగ్ రావడానికి ఇదే కారణం. అయితే ఇప్పుడు మిథిలాంచల్‌తో పాటు బీహార్‌లోని ఇతర జిల్లాలు కూడా మఖానా హబ్‌గా అభివృద్ధి చెందుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇతర జిల్లాల్లోని రైతులు భారీగా మఖానా సాగు చేస్తున్నారు. మఖానా సాగుతో రైతులు మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. దీంతో రైతులు తమ జీవన ప్రమాణాలు మెరుగుపరచుకుంటున్నారు.

ప్రముఖ వార్త పత్రిక నివేదిక ప్రకారం.. బీహార్‌లోని దర్భంగా, మధుబని జిల్లాల్లో మఖానా ఎక్కువగా సాగు చేస్తున్నారు. అయితే ఇపుడు పశ్చిమ చంపారన్ జిల్లాలో కూడా రైతులు భారీగా మఖానా సాగు చేస్తున్నారు. ఈ జిల్లాలో మఖానా ఉత్పత్తి పెరిగింది. అదే సమయంలో బెట్టియా జిల్లాలో కూడా మఖానా సాగుకు రైతులు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని లౌరియా బ్లాక్‌లో ఉన్న సతి సంహౌత గ్రామంలో రైతు ఆనంద్ సింగ్ గత 4 సంవత్సరాలుగా మఖానా సాగు చేస్తున్నారు. ఆనంద్ తన గ్రామంలో మఖానా సాగు చేసిన మొదటి రైతు. మఖానా సాగు చేయాలంటే ముందుగా విత్తనాన్ని 2 నెలల పాటు నీటిలో నానబెట్టాలని తెలిపారు. అక్టోబర్ నెలలో చెరువుల్లో నాట్లు వేయాలి. పంట చేతికి రావడానికి 8 నుంచి 10 నెలల సమయం పడుతుంది.

మార్కెట్‌లో మఖానా కిలో రూ.160 అమ్మకం

ఇవి కూడా చదవండి

జిల్లా మేజిస్ట్రేట్‌ను స్ఫూర్తిగా తీసుకుని రైతు ఆనంద్‌ మఖానా సాగుకు శ్రీకారం చుట్టారు. అయితే ఆనంద్  అంతకు ముందు చేపల పెంపకం, తోటపని చేసేవారు. మఖానా సాగు చేసేందుకు ఆనంద్ మొదట 1.4 ఎకరాల భూమిలో చెరువును తయారు చేశాడు. చెరువులో మఖానా సాగు ప్రారంభించారు. సుమారు 8 నెలల తర్వాత మఖానా పంట చేతికి రావడం ప్రారంభమైంది. విశేషమేమిటంటే 5 కిలోల విత్తనాలతో పంట మొదలు పెట్టగా.. చెరువు నుండి 550 కిలోల మఖానా ఉత్పత్తి లభించింది. ఆనంద్ మఖానాను కిలో రూ.160 చొప్పున మార్కెట్‌లో విక్రయించాడు. రూ.80 వేలకు పైగా ఆదాయాన్ని పొందాడు.

మఖానా సాగు చేసేవారికి ఆనంద్ సలహా

మఖానా సాగు చేసే కూలీలు చంపారన్‌లో దొరకడం లేదని ఆనంద్ చెప్పారు. మిథిలాంచల్ నుంచి కూలీలను తీసుకురావాలి. స్థానిక స్థాయిలో కూలీలు అందుబాటులో ఉంటే వ్యవసాయం చేయడం మరింత  సులువవుతుందని తెలిపారు. ఎవరైనా మఖానా సాగుచేయాలని కోరుకుంటే.. ప్రత్యేకంగా చెరువు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదని.. ఇప్పటికే ఉన్న చేపల పెంపకం చెరువులో కూడా మఖానా సాగు చేసుకోవచ్చని చెప్పారు. మఖానా సాగు చేయాలనుకునే రైతులు కావాలంటే తనను సలహాలు అడగొచ్చు అని చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..