చికెన్ స్కిన్ తింటే బాడీలో ఇన్ని జరుగుతాయా..? తినేముందు ఈ విషయాలు తెలుసుకోండి..

నాన్‌వెజ్ ప్రియుల్లో చాలా మంది చికెన్‌ను చర్మంతో కలిపి తినడానికి ఇష్టపడతారు. కానీ వైద్య నిపుణులు మాత్రం దీనిపై తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కోడి చర్మంలో ఉండే సంతృప్త కొవ్వు వల్ల కలిగే నష్టాలు ఏంటి? ఇది శరీరంలో కొలెస్ట్రాల్‌ను ఎలా పెంచుతుంది? బరువు తగ్గాలనుకునే వారు దీనికి ఎందుకు దూరంగా ఉండాలి? అనేది తెలుసుకుందాం..

చికెన్ స్కిన్ తింటే బాడీలో ఇన్ని జరుగుతాయా..? తినేముందు ఈ విషయాలు తెలుసుకోండి..
Health Risks Of Eating Chicken Skin

Updated on: Apr 18, 2026 | 1:53 PM

చికెన్ అంటే పడిచచ్చే వారు చాలా మంది ఉంటారు. కొందరు స్కిన్ లెస్ చికెన్ ఇష్టపడితే, మరికొందరు గ్రిల్డ్ లేదా ఫ్రైడ్ చికెన్‌ను చర్మంతో సహా తినడానికి మొగ్గు చూపుతారు. అయితే కోడి చర్మం తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? దీనివల్ల గుండెకు ఏమైనా ముప్పు ఉందా..? అనే డౌట్లు చాలా మందికి వస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చికెన్ చర్మంలో సంతృప్త కొవ్వు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి మేలు చేసే కొవ్వు కాదు. మీరు రెగ్యులర్‌గా చికెన్‌ను చర్మంతో సహా తింటే ఆ కొవ్వు మీ రక్తంలో చేరి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

గుండె జబ్బుల ముప్పు

కోడి చర్మంలో ఉండే అధిక కొవ్వు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ఈ కొవ్వు రక్తనాళాలలో పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. పక్షవాతం వచ్చే అవకాశం పెరుగుతుంది. రక్తపోటు నియంత్రణ తప్పుతుంది. ముఖ్యంగా ఇప్పటికే గుండె సమస్యలు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు దీనికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.

ఊబకాయం – ఇతర సమస్యలు

చికెన్ చర్మంలో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో దొరికే డీప్ ఫ్రైడ్ చికెన్ చర్మం ఎక్కువ నూనెను పీల్చుకుంటుంది. దీనివల్ల వేగంగా బరువు పెరుగుతారు. అధిక బరువు వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే ఛాన్స్ ఉంది. థైరాయిడ్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.

ఎప్పుడు తినాలి..?

చికెన్ చర్మం పూర్తిగా విషం ఏమీ కాదు. దీనిపై కొన్ని నియమాలు ఉన్నాయి.. రెండు మూడు నెలలకు ఒకసారి కాల్చిన లేదా బేక్ చేసిన చికెన్ చర్మాన్ని రుచి చూడటంలో పెద్ద ప్రమాదం లేదు. వారం వారం చికెన్ చర్మం తినే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి. అంతేకాకుండా చిన్న పిల్లలు, వృద్ధులు మరియు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు చికెన్ స్కిన్ తినకుండా ఉండటమే ఉత్తమం. రుచి కంటే ఆరోగ్యమే ముఖ్యం. చికెన్ వండుకునేటప్పుడు చర్మం తొలగించడం వల్ల మీరు అధిక క్యాలరీలను, కొవ్వును తగ్గించుకోవచ్చు.

Follow Us