ఇటీవలి కాలంలో చాలామంది బరువు తగ్గడానికి, బాడీని ఫిట్‌గా ఉంచడానికి రాత్రి సమయంలో అన్నం మానేసి చపాతీ తింటున్నారు. అయితే ఎన్నో రోజులుగా ఉన్న అన్నం తినే అలవాటును ఉన్నఫళంగా మార్చడం సరికాదంటున్నారు వైద్యులు. ప్రతి రోజు చపాతీలనే తినే అలవాటును చేసుకునే ముందుగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే లేనిపోని కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందట. అందువల్ల రాత్రిపూట పూర్తిగా అన్నం మానేసి దాని స్థానంలో చపాతీ తినే బదులు.. అన్నం తక్కువ తిని మిగతా భాగం చపాతీలు తినమని సూచిస్తున్నారు వైద్యులు. అంతేకాదు అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని తినే చపాతీల కంటే మధ్యాహ్నం చేసుకొని రాత్రికి తినడం ఉత్తమం అంటున్నారు. ఇంకా చపాతీల్లో నూనె కూడా తక్కువ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. మామూలుగా అయితే.. ఏదైనా ఆహారం ఎక్కువ సేపు నిల్వ ఉంచితే అందులోని పోషకాలు నిర్వీర్యమైపోతాయి. అయితే చపాతీలు, రోటీలు ఎంత ఎక్కువ సేపు నిల్వ ఉంటే ఆరోగ్యానికి అంత మంచిదట. మరి ఆ క్రమంలో చపాతీలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..