Hypertension Side Effects: ఈ ఆహార పదార్ధాలతో హైబీపీకి చెక్ పెట్టొచ్చు.. అవేంటో తెలుసుకోండి.!

ఈ మధ్యకాలంలో చాలామంది అధిక రక్తపోటు(హైబీపీ)తో బాధపడుతున్నారు. దీనికి చాలానే కారణాలు ఉండొచ్చు. ఉరుకుల పరుగుల జీవితం.. ఎప్పుడూ ఏదొక ఒత్తిడి..

Hypertension Side Effects: ఈ ఆహార పదార్ధాలతో హైబీపీకి చెక్ పెట్టొచ్చు.. అవేంటో తెలుసుకోండి.!
Hyper Tension

Updated on: Jan 14, 2022 | 7:25 PM

ఈ మధ్యకాలంలో చాలామంది అధిక రక్తపోటు(హైబీపీ)తో బాధపడుతున్నారు. దీనికి చాలానే కారణాలు ఉండొచ్చు. ఉరుకుల పరుగుల జీవితం.. ఎప్పుడూ ఏదొక ఒత్తిడి.. అది పర్సనల్ లేదా ప్రొఫిషినల్ కావొచ్చు, అలాగే జంక్ ఫుడ్ అలవాట్లు కారణంగా రక్తపోటు(Blood Pressure) బాధితుల సంఖ్య క్రమేపీ పెరుగుతూపోతోంది. ఉప్పు, మసాలాలు, ప్రోసెస్డ్ ఫుడ్ లాంటి వాటిని దూరంగా పెట్టాలని ప్రముఖ డైటీషియన్ డాక్టర్ అమ్రీన్ షేక్ చెబుతున్నారు. అలాగే హైబీపీ(Hypertension) వల్ల పలుసార్లు గుండె ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉందని చెబుతున్నారు.

రక్తపోటు రీడింగ్ ఇలా ఉంటుంది..

  • సాధారణ రక్తపోటు: 120/80 mm Hg

  • పెరిగిన రక్తపోటు: 120/129 mm Hg

  • పెరిగిన మొదటి దశ: 130/139 mm Hg

  • పెరిగిన రెండో దశ : 140/90 mm Hg

  • తీవ్రమైన రక్తపోటు: 180/120 mm Hg (అంతకు మించి)

హైబీపీని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి..

  • ఉప్పు కలిగిన నట్స్, సీడ్స్‌ను తినొద్దు

  • అధిక రక్తపోటును నివారించేందుకు అనువైన డైట్‌ను ఫాలో అవ్వండి.

  • పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తినండి.

  • సంతృప్త కొవ్వులు, చక్కెర తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి

  • తాజా పండ్లు, కూరగాయలను డైట్‌లో చేర్చండి

  • కొవ్వు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు తీసుకోవాలి

  • సిరిల్స్, పప్పు ధాన్యాలు, చిక్కుళ్లు

  • చేపలు, గుడ్లు తీసుకోవాలి

  • ఫ్రోజన్, ప్యాకేజ్డ్ ఆహారాలకు దూరంగా ఉండండి.

  • తీపి పదార్ధాలు, కూల్ డ్రింక్స్‌ను అవాయిడ్ చేయండి.

  • పచ్చళ్లు, అప్పడాలు తీసుకోవద్దు

కాగా, రక్తపోటును మనం కంట్రోల్‌లోకి తీసుకురాకపోతే.. గుండెపోటు, ధమని గోడలు బలహీనపడటం, హార్ట్ ఫెయిల్యూర్, కళ్లు, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం, మెటబాలిక్ సిండ్రోమ్, జ్ఞాపకశక్తి మందగించడం, అవగాహనా లోపం తలెత్తడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us