Rice Murukulu: అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..

| Edited By: Ravi Kiran

Dec 21, 2024 | 10:15 PM

అన్నంతో ఎన్నో రకాల స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కోసారి ఇంట్లో అన్నం మిగిలిపోతూ ఉంటుంది. ఈ అన్నంతో ఎగ్ రైస్ లేదా పులిహోర చేస్తూ ఉంటారు. కానీ మురుకులు కూడా చేసుకోవచ్చు. మిగిలిపోయిన అన్నంతోనే కాదు.. అన్నం ఫ్రెష్‌గా వండుకుని కూడా ఈ మురుకులు చేస్తే కరకరలాడుతూ భలేగా ఉంటాయి. వీటిని చేయడం కూడా చాలా సింపుల్. సాధారణ మురుకుల కంటే ఇవి చాలా త్వరగా అయిపోతాయి..

Rice Murukulu: అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
Rice Murukulu
Follow us on

అన్నంతో ఎన్నో రకాల స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కోసారి ఇంట్లో అన్నం మిగిలిపోతూ ఉంటుంది. ఈ అన్నంతో ఎగ్ రైస్ లేదా పులిహోర చేస్తూ ఉంటారు. కానీ మురుకులు కూడా చేసుకోవచ్చు. మిగిలిపోయిన అన్నంతోనే కాదు.. అన్నం ఫ్రెష్‌గా వండుకుని కూడా ఈ మురుకులు చేస్తే కరకరలాడుతూ భలేగా ఉంటాయి. వీటిని చేయడం కూడా చాలా సింపుల్. సాధారణ మురుకుల కంటే ఇవి చాలా త్వరగా అయిపోతాయి. మరి ఈ రైస్ మురుకులు ఎలా తయారు చేస్తారు? ఈ మురుకులకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి.

రైస్ మురుకులకు కావాల్సిన పదార్థాలు:

అన్నం, బియ్యం పిండి, ఉప్పు, కారం, వాము లేదా జీలకర్ర, నువ్వులు, ఆయిల్.

ఇవి కూడా చదవండి

రైస్ మురుకులు తయారీ విధానం:

ముందుగా అన్నాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని మెత్తగా పిసుక్కోవాలి. ఇందులో బియ్యం పిండి, ఉప్పు, కారం, వాము లేదా జీలకర్ర, నువ్వులు వేసి మురుకుల పిండిలా గట్టిగా ముద్దలా చేసుకోవాలి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. అయితే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఐదారు రోజలకు మించి నిల్వ ఉండవు. కాబట్టి తక్కువగానే తయారు చేసుకోండి. కానీ రుచి మాత్రం చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే.. పిండిని మురుకుల గొట్టంలో వేసుకుని ఆయిల్‌లో వత్తుకోవాలి. మీడియం మంట మీద వీటిని వేయించాలి. లేదంటే త్వరగా మాడిపోతాయి. అన్ని వైపులా బాగా వేయించాక తీసి టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే రైస్ మురుకులు సిద్ధం.