Chicken Soup: టేస్టీ చికెన్ సూప్.. ఈ టైమ్‌లో బెస్ట్ రెసిపీ..

| Edited By: Janardhan Veluru

Sep 28, 2024 | 12:29 PM

చికెన్ సూప్ అంటే చాలా మందికి రెస్టారెంట్సే గుర్తొస్తాయి. రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు చాలా మంది చికెన్ సూప్ వంటివి తాగుతూ ఉంటారు. ఇది ఎంతో పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. కానీ ఇంట్లో కూడా మనం సింపుల్‌గా చికెన్ సూప్ తయారు చేసుకోవచ్చు. అందులోనూ బయట ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు. అదే ఇంట్లో అయితే శుభ్రంగా చేసుకోవచ్చు. ప్రస్తుతం వర్షా కాలం కాబట్టి.. ఈ టైమ్‌లో సూప్స్ తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో వ్యాధులతో పోరాడే శక్తి..

Chicken Soup: టేస్టీ చికెన్ సూప్.. ఈ టైమ్‌లో బెస్ట్ రెసిపీ..
Chicken Soup
Follow us on

చికెన్ సూప్ అంటే చాలా మందికి రెస్టారెంట్సే గుర్తొస్తాయి. రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు చాలా మంది చికెన్ సూప్ వంటివి తాగుతూ ఉంటారు. ఇది ఎంతో పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. కానీ ఇంట్లో కూడా మనం సింపుల్‌గా చికెన్ సూప్ తయారు చేసుకోవచ్చు. అందులోనూ బయట ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు. అదే ఇంట్లో అయితే శుభ్రంగా చేసుకోవచ్చు. ప్రస్తుతం వర్షా కాలం కాబట్టి.. ఈ టైమ్‌లో సూప్స్ తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. బ్యాక్టీరియా, వైరస్‌ల బారిన పడకుండా ఉంటారు. మరి ఈ చికెన్ సూప్‌ని ఎలా తయారు చేస్తారు? ఈ సూప్ తయారు చేయడానికి ఎలాంటి పదార్థాలు కావాలో ఇప్పుడు చూద్దాం.

చికెన్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:

చికెన్, క్యారెట్, క్యాబేజీ, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, కార్న్ ఫ్లోర్, బంగాళ దుంపలు, కర్ర, ధనియాలు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం, యాలకులు, ఉప్పు, అనాపువ్వు, బిర్యానీ ఆకులు, నెయ్యి, పుదీనా తురుగు, కొత్తిమీర తరుగు.

చికెన్ సూప్ తయారీ విధానం:

ముందుగా చికెన్‌ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్‌ తీసుకుని అందులో ఉల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, దాల్చిన చెక్క, వెల్లులి, అల్లం వేసి మెత్తగా పేస్టు చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి చికెన్, ఈ మసాలా పేస్ట్, క్యారెట్, పచ్చి మిర్చి, ఆలూ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు చికెన్ ఉడకడానికి సరిపడా నీళ్లు వేసి మూత పెట్టి ఓ 6 విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించు కోవాలి.

ఇవి కూడా చదవండి

వేడి తగ్గాక ఇప్పుడు మూత తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక సాస్ పాన్ తీసుకుని ఇందులో కొద్ది ఆయిల్ వేయాలి. ఇందులో బిర్యానీ సరుకులు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉడికిన చికెన్ మిశ్రమం మొత్తం వేయాలి. కావాలి అనుకుంటే కొద్దిగా నీళ్లు వేసి మరింత సేపు ఉడికించుకోవచ్చు. ఆ తర్వాత కొత్తి మీర, పుదీనా, కరివేపాకు తురుము వేసి ఉడికించాలి. నెక్ట్స్ ఒక చిన్న గిన్నెలో కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీన్ని కూడా సూప్‌లో వేసి ఓ ఐదు నిమిషాల పాటు ఉడికించి దించేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే చికెన్ సూప్ సిద్ధం.