Pudina Rasam: వింటర్ సీజన్‌లో బెస్ట్ రెసిపీ పుదీనా చారు.. వేడి వేడిగా తింటే ఆహా..

| Edited By: Ram Naramaneni

Dec 12, 2024 | 9:36 PM

పుదీనా నుంచి మంచి సువాసన కూడా వస్తుంది. పుదీనాను ఇంటి మూలల్లో పెడితే కీటకాలు త్వరగా రాకుండా ఉంటాయి. పుదీనా ఆకులు పీల్చినా కూడా మంచిదే. పుదీనాతో కూడా వెజ్‌లో చాలా రకాల రెసిపీలు తయారు చేస్తూ ఉంటారు. పుదీనాతో చేసే వాటిల్లో పుదీనా చారు కూడా ఒకటి. ఇది చాలా రుచిగా ఉంటుంది..

Pudina Rasam: వింటర్ సీజన్‌లో బెస్ట్ రెసిపీ పుదీనా చారు.. వేడి వేడిగా తింటే ఆహా..
Pudina Rasam
Follow us on

పుదీనా తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పుదీనాలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. పుదీనాను ఎక్కువగా బిర్యానీ, పులావ్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. పుదీనాతో చేసే గ్రీన్ చట్నీ కూడా చాలా రుచిగా ఉంటుంది. పుదీనా నేరుగా నమిలినా రుచిగా వస్తుంది. పుదీనా నుంచి మంచి సువాసన కూడా వస్తుంది. పుదీనాను ఇంటి మూలల్లో పెడితే కీటకాలు త్వరగా రాకుండా ఉంటాయి. పుదీనా ఆకులు పీల్చినా కూడా మంచిదే. పుదీనాతో కూడా వెజ్‌లో చాలా రకాల రెసిపీలు తయారు చేస్తూ ఉంటారు. పుదీనాతో చేసే వాటిల్లో పుదీనా చారు కూడా ఒకటి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఈ చారు నేరుగా తాగినా హెల్త్‌కి మంచిదే. మరి పుదీనా చారుకు కావాల్సిన పదార్థాలు ఏంటి? పుదీనా చారుని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

పుదీనా చారుకు కావాల్సిన పదార్థాలు:

పుదీనా, టమాటా, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, కారం, పసుపు, ఉప్పు, చింత పండు, నెయ్యి, ఆయిల్, తాళింపు దినుసులు, నల్ల మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ, శనగపప్పు

పుదీనా చారు తయారీ విధానం:

పుదీనా చారు తయారీకి ముందుగా పొడి తయారు చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి.. ధనియాలు, శనగపప్పు, మిరియాలు, ఎండు మిర్చి, జీలకర్ర వేసి వేయించుకోవాలి. చల్లారాక మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో కొద్దిగా గోరు వెచ్చని నీళ్లు పోసి చింత పండు నానబెట్టుకోవాలి. దీన్ని పిసికి గుజ్జులా తీసుకోవాలి. ఇప్పుడు ఈ గుజ్జును ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో నిండా నీల్లు పోయాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత అందులోనే టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పొడి చేసి పెట్టుకున్న పొడి కూడా వేయాలి. ఇవన్నీ బాగా వేసి బాగా మరిగించాలి. చివరగా తాళింపు పెట్టుకుని.. రసంలో కలిపేయాలి. కొత్తిమీర, కరివేపాకు తాళింపులో వేసి మరిగిస్తే చాలా రుచిగా ఉంటుంది. అంతే ఎంతో రుచికరమైన పుదీనా రసం సిద్ధం. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది.