చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాలైన పోషకాలు లభిస్తాయి. చేపలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులను రాకుండా ముందుగానే చేపలు హెల్ప్ చేస్తాయి. చేపలతో ఎన్నో రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. ఎక్కువగా చాలా మంది పులుసు కర్రీలు చేస్తారు. అప్పుడప్పుడు ఫ్రై చేస్తూ ఉంటారు. ఇక రెస్టారెంట్లలో అయితే చెప్పాల్సిన పని లేదు. ముళ్లు లేకుండా తినేందుకు వీలుగా అనేక వంటలు చేస్తారు. ఇలా రెస్టారెంట్ స్టైల్‌లో చేసే వంట్లలో ఈ ఫింరగర్ ఫిష్ కూడా ఒకటి. ఇది అలా నోట్లో పెట్టుకోగానే ఇలా కరిగిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మరి ఈ ఫింగర్ ఫిష్ ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి.
చేపలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, నిమ్మరసం, పసుపు, బ్రెడ్ ముక్కలు, జీలకర్ర పొడి, గుడ్లు, ఆయిల్, నిమ్మరసం.
ముందుగా ముళ్లు ఎక్కువగా లేని చేపను ఎంచుకోండి. దీన్ని బాగా శుభ్రం చేసి.. ముళ్లు అన్నీ తీనేసి ఓన్లీ మాంసాన్ని తీసుకోవాలి. ఈ మాంసాన్ని ముక్కలుగా కోసి తీసుకోండి. ఈ ముక్కలను ఓ బౌల్‌లోకి తీసుకోవాలి. ఆ తర్వాత గుడ్డు తెల్ల సొన గిలక్కొటి పక్కన పెట్టండి. ఆ తర్వాత బ్రెడ్‌ని పెనం మీద వేయించి.. పొడి చేసుకుని ఓ ప్లేట్‌లో పెట్టండి. చేప ముక్కల్లో కొద్దిగా కారం, పసుపు, ఉప్పు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి వేసి అన్నీ మిక్స్ చేసి కలుపుకోవాలి.
ఆ తర్వాత ఓ కడాయి తీసుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ముందుగా గుడ్డు మిశ్రమంలో ముంచి.. ఆ తర్వాత బ్రెడ్ పొడిలో దొర్లించి.. ఆయిల్‌లో వేసి ఫ్రై చేయాలి. మంట మీడియంలో ఉండాలి. లేదంటే ముక్కలు మాడిపోతాయి. ఇలా ఎర్రగా వేయించుకున్నాక.. సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఫింగర్ ఫిష్ సిద్ధం. దీన్ని టమాటా సాస్, గ్రీన్ చట్నీతో తింటే ఆహా భలేగా ఉంటుంది.