Udalu Benefits: చిరు ధాన్యాల్లో ఊదలు ఒకటి. రుచికి తియ్యగా ఉండే వీటిని ఎక్కువగా ఆసియా ఖండంలోనే పండిస్తారు. భారత్, పాకిస్థాన్ , నేపాల్ , జపాన్ , చైనా పర్వత ప్రాంతాలలో ఎక్కువగా పండుతాయి. మన దేశంలో ఈ ఊదలను ఎక్కువగా ఉత్తరాఖండ్ లో పండించగా.. తమిళనాడులోని పర్వత ప్రాంతాల్లో కూడా వీటిని పండిస్తున్నారు.
రుచికి తియ్యగా ఉండే ఈ ఊదలతో తయారు చేసే ఆహరం మంచి బలవర్ధకమైంది. ఈజీగా జీర్ణమవుతుంది. అందుకనే నార్త్ ఇండియాలో చాలామంది ఉపవాస దీక్ష చేసే సమయంలో ఊదలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటారు. ఊదలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు గురించి ఈరోజు తెలుసుకుందాం
*ఊదలు శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది.
*ఊదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
*సులభంగా జీర్ణం కావడంతో ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారికీ ఇవి మంచి ఆహారం
*ఊదల్లో పీచు పదార్ధం అధికంగా ఉండటం వలన మలబద్దకానికి, మధుమేహానికి మంచిది
*జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేగులలో ఏర్పడే పుండ్లు, పెద్ద ప్రేగులకి వచ్చే కాన్సర్ బారిన పడకుండా ఊదలు చేస్తాయి.
*ఉత్తరాఖండ్, నేపాల్ లో ఊదల ఆహారాన్ని గర్భిణీలకు, బాలింతలకు పెడతారు. గర్భవతులకు , పాలిచ్చే తల్లులకు చనుబాలు ఎక్కువ రావడానికి మంచి బలవర్ధకమైన ఆహారం.
*కాలేయం, పిత్తాశయం శుభ్రపర్చడానికి సహాయపడుతుంది.నియంత్రిస్తుంది
* బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రించడానికి , గుండె పనితీరు మెరుగుపరచడానికి సహాయపడుతుంది
* కాలేయం, మూత్రాశయం, గాల్ బ్లాడర్ శుద్ధికి పనిచేస్తాయి
*కాలేయపు, గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి ఊద బియ్యం పనికి వస్తాయి.
*.కామెర్లను తగ్గించడానికి వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి
*పెద్ద వారిలో మూత్రాశయ నియంత్రణ కొరకు, పిత్తాశయంలో రాళ్లను నిర్మూలించేందుకు, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు నయం కావడానికి ఊదలు బాగా పనిచేస్తాయి.
Also Read: