Custard Apple: సీతాఫలమే ఆరోగ్యానికి శ్రీరామరక్ష.. దీని ప్రయోజనాలు తెలిస్తే మీరు ఒప్పుకోవాల్సిందే…
కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించే శక్తి కూడా సీతాఫలానికి ఉంది. రోగనిరోధక శక్తి పెంపొందించే సీతాఫలం మన ఆరోగ్యానికి ఒక సంజీవనిలా పనిచేస్తుంది. అమృతాన్ని తలపించే సీతాఫలం తింటే..
మన ఆకలిని తీర్చడానికే కాక ఆరోగ్యానికి కూడా మేలు చేసే ఎన్నో రకాల పండ్లు ప్రకృతిలో దొరుకుతాయి. ఒక్కప్పుడు పండ్లు వాటి వాటి సీజన్‌లలో మాత్రమే లభించాయి. అయితే ప్రస్తుతం అవి అన్నీ కాలల్లో, సీజన్‌లలో లభిస్తున్నాయి. ఇక పండ్లలో దొరికే పోషకాలు మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇంకా వీటిని తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు మన దరి చేరవు. వీటిలో ఉండే మాంసకృతులు, విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్, ఔషధ గుణాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాంటి పండ్లలో సీతాఫలం ప్రముఖమైనది. దీనిలోని గుజ్జు నుంచి పారవేసే గింజల వరకూ ఎంతో ఉపయోగకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అంతేకాక కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించే శక్తి కూడా సీతాఫలానికి ఉంది. రోగనిరోధక శక్తి పెంపొందించే సీతాఫలం మన ఆరోగ్యానికి ఒక సంజీవనిలా పనిచేస్తుంది. అమృతాన్ని తలపించే సీతాఫలం తింటే నోటిలోని జీర్ణరసాలను పెరుగుతాయి. తద్వారా జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. అన్నికాలలోనూ లభించే సీతాఫలం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇప్పుడు చూద్దాం..