Chicken Pasta: చికెన్ పాస్తా.. ఇలా చేస్తే. అబ్బబ్బా అంటూ లాగించేస్తారు..

సాధారణంగా పాస్తాను వెజిటేరియన్స్‌ టిఫిన్‌లా లేదా స్నాక్స్‌ రూపంలో తీసుకుంటారు. అయితే పాస్తాతో నాన్‌వెజ్‌ వంటకాలు కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇటాలియన్‌ స్టైల్‌ ఫుడ్‌లో ఇలాంటివి ఎక్కువగా పాపులర్‌ అని చెప్పొచ్చు. చికెన్‌ పాస్తా చేసుకొని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఇంతకీ చికెన్‌ పాస్తాను ఎలా తయారు చేసుకోవాలి.? కావాల్సిన పదార్థాలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Chicken Pasta: చికెన్ పాస్తా.. ఇలా చేస్తే. అబ్బబ్బా అంటూ లాగించేస్తారు..
Chicken Pasta
Follow us

|

Updated on: Sep 28, 2024 | 10:32 AM

సాధారణంగా పాస్తాను వెజిటేరియన్స్‌ టిఫిన్‌లా లేదా స్నాక్స్‌ రూపంలో తీసుకుంటారు. అయితే పాస్తాతో నాన్‌వెజ్‌ వంటకాలు కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇటాలియన్‌ స్టైల్‌ ఫుడ్‌లో ఇలాంటివి ఎక్కువగా పాపులర్‌ అని చెప్పొచ్చు. చికెన్‌ పాస్తా చేసుకొని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఇంతకీ చికెన్‌ పాస్తాను ఎలా తయారు చేసుకోవాలి.? కావాల్సిన పదార్థాలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు..

ఇందుకోసం పాస్తా, చికెన్‌, నూనె, జీడిపప్పు, టమాట, ఉప్పు, పుదీన, అల్లం వెల్లుల్లి, కరివేపాకు, మిరియాలు, మసాల, పసుపు , కారం.

తయారీ విధానం..

చికెన్‌ పాస్తా తయారీ కోసం ముందుగా. కొంత పాస్తాను తీసుకొని ఉడకబెట్టుకోవాలి. అలాగే చికెన్‌ను ఉడకబెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కనపెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఒక ప్యాన్‌ తీసుకొని స్టౌవ్‌పై పెట్టాలి. అనంతరం అందులో కాస్త నూనె వేయాలి. నూనె వేడి అయ్యాక అందులో జీడిపప్పును ముక్కలుగా చేసి నూనెలో వేసుకొని జీడిపప్పును వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేపాలి. అనంతరం టమాట ముక్కలను వేయాలి. ఆ తర్వాత కాస్త ఉప్పు వేసుకొని బాగా కలపాలి. కొన్ని పుదీన రెమ్మలను తుంచి వేసుకోవాలి. మంట సిమ్‌లో పెట్టుకొని అన్నింటిని బాగా కలపాలి. ఆ తర్వాత స్టౌవ్‌ను ఆఫ్‌ చేసుకొని వేయించినవి చల్లబడేంత వరకు పక్కన పెట్టుకోవాలి.

ఆ తర్వాత వేయించిన అన్నింటినీ మిక్సీ జార్‌లో వేసి మంచి పేస్ట్‌లాగా మార్చుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ తీసుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో కొన్ని మిరియాలు, కరివేపాకు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులోనే కొంత మసాలా, పసుపు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో అంతకుముందు ఉడకబెట్టుకున్న చికెన్, పాస్తాను వేసుకొని బాగా కలుపుకోవాలి. అనంతరం అంతకు ముందు రడీ చేసుకున్న పేస్ట్‌ను వేసుకొని బాగా కలుపుకోవాలి. క్యాప్‌ పెట్టేసి కొంతసేపు హై ఫ్లేమ్‌పై పెట్టాలి. అంతే చికెన్‌ పాస్త రడీ అయినట్లే.

మరిన్ని ఫుడ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!