తేలు కుడితే వెంటనే ఇలా ప్రథమ చికిత్స చేయండి..

27 September 2024

TV9 Telugu

TV9 Telugu

వానాకాలంలో పాములు, తేళ్ల భయం పొంచి ఉంది. పాము, తేలు కరిచిన వెంటనే ఆందోళన చెందకుండా సరైన సమయంలో చికిత్స పొందితే ముప్పు నుంచి బయటపడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు

TV9 Telugu

తేలు కరిచినప్పుడు భయపడకుండా వెంటనే ప్రథమ చికిత్స చేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. తేలు కుట్టడం వల్ల చాలా నొప్పిగానూ, మంటగానూ ఉంటుంది

TV9 Telugu

అందువల్ల కాటు వేసిన చోట ఐస్‌ను రాయాలి. ఇన్ఫెక్షన్ రాకుండా కాటు వేసిన ప్రదేశాన్ని సబ్బు వేసి గోరువెచ్చని నీటితో కడగాలి

TV9 Telugu

వేపనూనెలో పసుపు కలిపి యాంటీసెప్టిక్‌గా పూయడం మంచిది. తేలు కరిచిన చోటకి కాస్త పైన అంటే విషయం శరీరం అంతా వ్యాపించకుండా గుడ్డతో గట్టిగా కట్టుకుంటే విషం శరీరంలోకి చేరే అవకాశాలు తగ్గుతాయి

TV9 Telugu

తేలు కుట్టినప్పుడు ఆ ప్రదేశంలో మిరియాల పొడి చల్లితే విష ప్రభావం తక్కువగా ఉంటుంది. అనంతరం వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరకు వెళ్లాలి

TV9 Telugu

అదే పాము కాటు వేస్తే.. శరీరంలో పాము కాటు ప్రభావిత ప్రాంతాన్ని సాధ్యమైనంత మేర కదిలించకుండా ఉంచాలి. శరీరంపై నగలు, గడియారాలను తొలగించాలి. దుస్తులను వదులు చేయాలి

TV9 Telugu

పాము కాటు ప్రాంతం నుంచి విషాన్ని నోటితో లాగకూడదు. ఆ ప్రాంతాన్ని కోసి రక్తస్రావమయ్యేలా చేయకూడదు. విషం శరీరంలోకి విషయం వెళ్లేందుకు మూడు గంటల సమయం పడుతుంది. ఆ లోపు కాటుకు పైన అంటే గుండె వైపుగా బలంగా తాడుతో కట్టాలి

TV9 Telugu

సూదిలేని సిరంజీని తీసుకుని ఆ గాట్లలో ఓ చోట పెట్టి రక్తాన్ని అందులోకి లాగాలి. ఇలా చేస్తున్నప్పుడు మొదట వచ్చే రక్తం కాస్తా నలుపు రంగులో ఉంటుంది. అది విషతుల్యమైన రక్తం అని అర్థం. ఇలా రెండు మూడు సార్లు చేసిన తర్వాత డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లాలి