ఆరోగ్యానికి వరమే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం.. 

27 September 2024

TV9 Telugu

Pic credit -  Pexels

కొబ్బరి నీరు సహజమైన హెల్త్ డ్రింక్. ఎన్నో రకాల పోషకాలున్న కొబ్బరి నీరుని తాగడం వలన హైడ్రేట్ గా ఉంటాం. అనేకాదు కొబ్బరి నీరులో ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉన్నాయి. 

 నేచురల్ హెల్త్ డ్రింక్ 

యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉండే కొబ్బరి నీరు కొంత మందికి ఆరోగ్యకరం.. అదే సమయంలో మరికొందరికి విషంతో సమానం. 

ఆరోగ్యానికి వరం 

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొబ్బరి నీరు ప్రకృతి ఇచ్చిన వరం. అయినా  కొంతమంది మాత్రం ఈ కొబ్బరి నీళ్లు అస్సలు తాగకూడదు. ఎందుకంటే 

వీరికి విషంతో సమం 

గర్భం దాల్చిన మొదటి 3 నెలల్లో కొబ్బరినీళ్లకు దూరంగా ఉండడం మంచిది. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల జలుబు చేస్తుంది. మార్నింగ్ సిక్నెస్ వంటి జీర్ణ సమస్యలకు కూడా దారితీస్తుంది

గర్భందాల్చిన మొదట్లో 

ఆపరేషన్ చేయించుకోవడానికి రెండు వారల ముందు కొబ్బరి నీరుని తాగవద్దు. లేదంటే బీపీ, బ్లడ్ షుగర్ నియంత్రణ కష్టం. ఆరోగ్యం రిస్క్ లో పడుతుంది. 

ఆపరేషన్ చేయించుకునే వారు 

కొబ్బరి నీరులో చక్కెర ఉంటుంది. షుగర్ పేషెంట్స్ కొబ్బరి నీటిని తాగడం వలన షుగర్ లెవెల్ పెరుగుతుంది. షుగర్ వ్యాధి ఉంటే కొబ్బరి నీళ్లను ఎట్టిపరిస్థితిలో తాగకండి. 

షుగర్ పేషెంట్స్ 

కొబ్బరి నీళ్లలో సోడియం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ నీటిని తాగడం వలన రక్తపోటులో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. కనుక హై బీపీ పేషెంట్లు కొబ్బరి నీరు తాగక పోవడమే మంచిది. 

హై బీపీ 

కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కనుక మూత్రపిండాల సమస్య ఉన్నవారు కొబ్బరి నీళ్లను అస్సలు తాగకూడదు. వీరికి విషంలా పనిచేస్తాయి. 

కిడ్నీ సమస్యలు ఉంటే..