మనం మన ముఖాన్ని జాగ్రత్తగా చూసుకున్నంతగా మన పాదాలను పట్టించుకోము. ఫలితంగా మన పాదాలపై నల్లటి మచ్చలు కనిపిస్తాయి. పాదాలపై ఈ నల్లటి మచ్చలు చూడటానికి చాలా చెత్తగా ఉంటాయి. చర్మం ఈ పేలవమైన ఛాయకు ప్రధాన కారణం మెలనిన్ అధికంగా ఉత్పత్తి కావడం. మెలనిన్ అనేది చర్మానికి పిగ్మెంటేషన్ ఇచ్చే సహజ వర్ణద్రవ్యం. చర్మంలో ఉండే మెలనోసైట్స్ కణాలలో దీని నిర్మాణం ప్రక్రియ పూర్తవుతుంది. మీ చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉంటే.. మీ చర్మం ముదురు రంగులో ఉంటుంది. కాళ్లపై నల్లటి మచ్చలు అంటే ఆ ప్రాంతంలో మెలనిన్ ఎక్కువగా ఉందని అర్థం. ఈ డార్క్ స్పాట్స్ మీ పాదాలు, శరీరంలో ఎక్కడైనా రావచ్చు. తరచుగా మనం పాదాల నలుపును పోగొట్టుకోవడానికి పెడిక్యూర్ సహాయం తీసుకుంటాం వల్ల మీ పాదాల నలుపు తగ్గదు. అంతకంటే మరో ప్రయత్నం చేయాలి.
మీరు కూడా పాదాల నలుపుతో ఇబ్బంది పడుతుంటే.. వాటిని తొలగించుకోవడానికి మీరు కొన్ని హోం రెమెడీస్ ప్లాన్ చేయవచ్చు. మన ఇంట్లో ఉండే అలోవెరా జెల్, బేకింగ్ సోడా, ఉప్పును ఉపయోగించడం వల్ల పాదాల నల్లదనాన్ని తొలగించడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. పాదాల నలుపును పోగొట్టడానికి ఈ వస్తువులను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
అలోవెరా జెల్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని మెరుపును ఇస్తుంది, అలాగే చర్మంలోని నల్లటి వలయాలను తొలగిస్తుంది. దీన్ని చర్మంపై ఉపయోగించడం వల్ల చర్మ ఛాయ మెరుగుపడుతుంది. బేకింగ్ సోడాను చర్మానికి ఉపయోగించడం వల్ల చర్మం మెరుస్తుంది. ఇది డెడ్ స్కిన్ ను తొలగిస్తుంది. చర్మపు మచ్చలను తొలగిస్తుంది. నీటితో చర్మంపై ఉప్పును ఉపయోగించడం ద్వారా, చర్మంపైన ఉండే ఓపెన్ రంధ్రాలు మూసివేయబడతాయి. ఇది చర్మాన్ని మృదువుగా.. తాజాగా చేస్తుంది. ఈ నీరు చర్మాన్ని శుభ్రంగా, మెరిసేలా చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్
1 స్పూన్ అలోవెరా జెల్
1 స్పూన్ ఉప్పు తీసుకోండి.
పాదాల నలుపు పోవాలంటే అలోవెరా జెల్ లో బేకింగ్ పౌడర్, ఉప్పు కలిపి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ని పాదాల నల్లని భాగానికి పట్టించి పాదాలకు మసాజ్ చేయాలి. ఈ ప్యాక్‌తో 4-5 నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో పాదాలను కడగాలి. పాదాలను కడిగిన తర్వాత వాటిని ఆరబెట్టి కొబ్బరినూనెతో పాదాలకు మసాజ్ చేయాలి. నిత్యం పాదాలను శుభ్రం చేసుకుంటే పాదాల నలుపు పోతుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..