ధాన్యాలు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. ఈ ధాన్యాల్లో ఎక్కువగా గోధుమలు, రాగులు, జొన్నలు ముఖ్యం. వీటితో తయారు చేసిన పిండ్లను వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. మైదా పిండి ఆరోగ్యానికి మంచిది కాదని.. చాలా మంది గోధుమ పిండి ఉపయోగిస్తారు. అలాగే ఈ మధ్య రాగి పిండిని కూడా వాడుతున్నారు. గోధుమ పిండి, రాగి పిండి కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిల్లో అనేక పోషకాలు లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ రెండూ ఆరోగ్యానికి మంచిదే అయినా.. ఏది తినాలో అన్న కన్ఫ్యూజన్ ఖచ్చితంగా ఉంటుంది. చాలా మంది గోధుమ పిండి మంచిది అంటే.. మరికొంత మంది రాగి పిండి అని అంటారు. ఇంతకీ ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచి? ఆరోగ్య నిపుణులు ఏం అంటున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి పిండిలో ఫైబర్, ఐరన్, విటమిన్లు, అమైనో యాసిడ్స్, క్యాల్షియం, రాగి వంటివి లభిస్తాయి. బియ్యంతో కలిపి రాగి తినొచ్చు. వివిధ రకాల వంటలు కూడా తయారు చేసుకోవచ్చు. డయాబెటీస్ కంట్రోల్‌కు, బీపీ నియంత్రణకు, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో రాగి పిండి ఎంతో చక్కగా పని చేస్తుంది. గాయాలను త్వరగా నయం చేయడంలో కూడా రాగి పిండి సహాయ పడుతుంది. జీర్ణ సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. అయితే కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు, థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నారు రాగి పిండి తినకపోవడమే మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం కూడా ఉంటుంది. కాబట్టి తక్కువగా తీసుకోవాలి.
గోధుమ పిండి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మధ్య కాలంలో మైదా పిండికి బదులుగా అన్నీ గోధుమ పిండి ఉపయోగించే తయారు చేస్తున్నారు. గోధుమ పిండిలో పోషకాలు కూడా ఎక్కువగానే లభిస్తాయి. ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, జింక్, ఐరన్, ఇనుము, విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ గోధుమ పిండితో చపాతీలు, ఫూరీలు, ఉప్మా, కేక్ వంటివి తయారు చేసుకోవచ్చు. గుండెకు ఈ పిండి చాలా మంచి చేస్తుంది. అయితే గోధుమ పిండి కూడా చాలా తక్కువగా తీసుకోవాలి. లేదంటే కడుపులో నొప్పి, జీర్ణ సమస్యలు వస్తాయి. బరువు కూడా పెరుగుతారు.
రాగి, గోధుమ పిండ్లు రెండూ మంచివే అయినా.. ఏది ఎక్కువైనా ఆరోగ్యానికి మంచి కాదు. చపాతీలు, గోధుమ పిండి దోశలు వంటివి చేసేటప్పుడు రాగి పిండి కూడా కలపండి. అలాగే ఇడ్లీ పిండి, దోశ పిండిలో కూడా రాగి పిండి మిక్స్ చేసి వాడుకోవచ్చు. రెండూ కలిపి తింటే ఎలాంటి సమస్యలు ఉండవు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.