Eggs: కోడి గుడ్లు పచ్చివి తాగవచ్చా.. నిపుణులు ఏం అంటున్నారంటే!

|

Dec 18, 2024 | 1:00 PM

కొన్ని రకాల ఆహారాలు పచ్చివి, ఆఫ్ బాయిల్ తినకూడదు. వీటి వలన అనారోగ్య సమస్యలు రావడం ఖాయం. వీటిల్లో గుడ్లులు కూడా చేరతాయి. గుడ్లను కూర రూపంలో ఉడికించి తీసుకుంటే మంచిది. చాలా మంది పచ్చి గుడ్లు తాగుతూ ఉంటారు. ఇలా తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకోండి..

Eggs: కోడి గుడ్లు పచ్చివి తాగవచ్చా.. నిపుణులు ఏం అంటున్నారంటే!
Eggs
Follow us on

కోడిగుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గుడ్లు పోషకాహారం నిండిన ఆహారం. ప్రతి రోజూ ఒక గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి జరిగే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. గుడ్లు తినడం వల్ల శరీరం బలంగా, దృఢంగా తయారవుతుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు చక్కగా అందుతాయి. కోడిగుడ్డును ఎవరి ఇష్టానికి తగ్గట్టుగా వారు తింటూ ఉంటారు. చాలా మంది ఎక్కువగా ఆమ్లెట్ తినేందుకు ఇష్టపడతారు. అయితే మరికొంత మంది పచ్చి గుడ్లనే తాగుతూ ఉంటారు. ఇలా పచ్చి గుడ్లను తాగవచ్చా? అలా తినడం మంచిదేనా! అనే డౌట్ చాలా మందిలో వచ్చే ఉంటుంది. మరి పచ్చి గుడ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదేనా? అనేదానిపై నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

తాగవచ్చు:

పచ్చి గుడ్డును నేరుగా తాగవచ్చు. ఇలా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే. కానీ ఒకటి లేదా రెండు వరకు ఓకే. మరీ ఎక్కువగా తాగితే మాత్రం ఆరోగ్య సమస్యలు రావడం గ్యారెంటీ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. కానీ తక్కువ పరిమాణంలో ఉంటుంది. కాబట్టి ఎక్కువగా తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు రావచ్చు. వేడి చేసి, ఉడికించి తింటే ఈ బ్యాక్టీరియా నశిస్తుంది. కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు.

ఈ సమస్యలు తలెత్తవచ్చు:

జిమ్‌కి వెళ్లేవారు ఎక్కువగా పచ్చి గుడ్లను తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారిలో శక్తిని నింపడానికి. కానీ తరచూ పచ్చి గుడ్లను తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు గుడ్లను ఉడికించి లేదా ఆమ్లెట్ రూపంలోనే తీసుకోవాలి. లేదంటే ఇమ్యూనిటీ మరింత నశించి.. అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా కారణంగా జీర్ణ సమస్యలు, ఇన్ఫెక్షన్లు, వాంతులు, జ్వరం వస్తాయి. బయోటిన్ లోపిస్తుంది. దురద, వెంట్రుకలు రాలిపోవడం, నరాల బలహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వైద్యుల సలహా మేరకు మాత్రమే పచ్చి గుడ్లను తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.