Lifestyle: నిత్యం కడుపుబ్బరంగా ఉంటుందా.? ఇలా చేయండి..

తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా మలబద్ధకం, అజీర్తి, కడుపుబ్బరం వంటి సమస్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఉదయం లేవగానే ఖాళీగా ఉండే కడుపు టిఫిన్‌ చేయగానే ఉబ్బరంగా మారుతుంది. రాత్రి పడుకునే వారే ఈ సమస్య వేధిస్తూనే ఉంటుంది. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టాలంటే తీసుకునే ఆహారంలో మార్పు చేసుకోవాలని నిపుణులు...

Lifestyle: నిత్యం కడుపుబ్బరంగా ఉంటుందా.? ఇలా చేయండి..
Stomach Problems
Follow us

|

Updated on: Jun 16, 2024 | 12:37 PM

మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువుతున్నాయి. ముఖ్యంగా జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడం, ఫైబర్‌ కంటెంట్ తక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తున్నాయి. దీంతో దీర్ఘకాలంలో ఇది పెద్దపేగు సమస్యకు కారణమవుతుందని వైద్యులు అంటున్నారు. అందుకే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా మలబద్ధకం, అజీర్తి, కడుపుబ్బరం వంటి సమస్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఉదయం లేవగానే ఖాళీగా ఉండే కడుపు టిఫిన్‌ చేయగానే ఉబ్బరంగా మారుతుంది. రాత్రి పడుకునే వారే ఈ సమస్య వేధిస్తూనే ఉంటుంది. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టాలంటే తీసుకునే ఆహారంలో మార్పు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే పేగుల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే ఈ సమస్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

రోజూ తీసుకునే ఆరోగ్య‌క‌ర‌మైన అల‌వాట్ల‌తో పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యకు పరిష్కారం లభించాలంటే.. రాత్రివేళ నాలుగైదు కిస్‌మిస్‌ల‌ను నీటిలో నాన‌బెట్టి ఉద‌యాన్నే వాటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌, స‌హ‌జ‌మైన చ‌క్కెర‌లు జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తాయని పేగుల కదలికలను ప్రేరేపిస్తాయి. ఇక నిర్ణీత సమయంలో భోజనం మగించేలా చూసుకోవాలి.

ప్రతిరోజూ ఒకే సమయంలో టిఫిన్‌, లంచ్‌, డిన్నర్‌ తీసుకోవడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఇది పేగుల ఆరోగ్యం మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ఇక మధ్యాహ్నం గ్లాసులో ఒక టీస్పూన్‌ చియా సీడ్స్‌తో కూడిన వాట‌ర్‌ను తీసుకోవ‌డం మేలు. చియా గింజ‌ల్లో అధిక ఫైబ‌ర్‌తో పాటు శ‌రీరానికి అవ‌స‌ర‌మైన పోష‌కాలు ప్రేవుల ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తాయి. వీటితో పాటు అవిసె గింజ‌లు, పండ్లు, కూర‌గాయ‌లు, త‌గినంత నీరు, ప్రొ బ‌యాటిక్ ఫుడ్స్‌, రాత్రి వేళ నెయ్యి, పాలుతో పాటు ప‌డుకునే ముందు అంజీరా పండ్లు తీసుకుంటే కడుపు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles