ముఖం మీద గాయం గుర్తులు తొలగిపోవట్లేదా? నల్లటి మచ్చలు అలాగే ఉంటున్నాయా? మీ అందాన్ని ఆ మచ్చలు తగ్గిస్తున్నాయా? మరేం టెన్షన్ పడకండి. వంటింట్లో నిత్యం వినియోగించే పదార్థాలనేతో ఆ మచ్చలను తొలగించుకోవచ్చు. అవును, ఆ మచ్చలను తొలగించుకునేందుకు వేలకు వేలు ఖర్చు చేస్తూ మార్కెట్‌లో లభించే రకరకాల ప్రోడక్ట్స్, క్రీమ్స్ ఉపయోగించడం వలన కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని, నాచురల్‌గా ఇంట్లో లభించే పదార్థాలతోనే ఆ మచ్చలకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు బ్యూటీషియన్స్. మరి ముఖంపై ఆ మచ్చలను తొలగించే చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అవును, నిమ్మరసంతో అద్భుత ప్రయోజనం ఉంటుంది. నిమ్మరసంతో ముఖంపై ఎలాంటి మరకలు, మచ్చలనైనా పోగొట్టుకోవచ్చు. నిమ్మకాయ సహజమైన బ్లీచ్‌గా పని చేస్తుంది. దాని ఆమ్ల స్వభావం కారణంగా గాయాలు సులభంగా తగ్గుతాయి. అలాగే, గాయాల మచ్చలు కూడా తొలగిపోతాయి. ఒక గిన్నెలో ఒక నిమ్మకాయ రసాన్ని తీసి, ఆ రసంలో దూదిని ముంచి ముఖంపై ఉన్న మచ్చలపై అప్లై చేయాలి. ఆ మచ్చల మీద దాదాపు 5 నుంచి 10 పాటు మర్దన చేయాలి. ఆ తరువాత కాసేపు ఆరనీయాలి. 30 నిమిషాల తరువాత మంచి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
తేనెతో కూడా మచ్చలు తొలగిపోతాయి. రెండు చెంచాల తేనెలో రెండు చెంచాల బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ని మచ్చ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. దీనిని ఇలాగే చేస్తే.. రెండు వారాల తరువాత మచ్చలు తగ్గుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది.
ఉల్లిపాయ రసం కూడా మచ్చలను తొలగించడంలో ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. ఇందుకోసం ఉల్లిపాయ రసాన్ని తీసి మచ్చలు ఉన్న ప్రదేశంలో రాయాలి. కాసేపు అలాగే ఆరనివ్వాలి. ఆ తరువాత గొరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు త్వరలోనే నయమవుతాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.