AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dupatta Vs Sunscreen: ఎండ నుంచి రక్షణ కల్పించడంలో సన్‌స్ర్కీన్‌కి ప్రత్యామ్నయంగా స్కార్ఫ్‌ వాడొచ్చా..?

వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. దీంతో చాలా మంది అమ్మాయిలకు ఎండలోకి బయటకు వెళ్ళేటప్పుడు తమ ముఖాలను దుపట్టాతో కప్పుకునే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల నిజంగా సూర్యుని అతినీలలోహిత కిరణాలను అడ్డుకుంటుందా? ముఖం నల్లబడకుండా కాపాడుతుందా? వంటి సందేహాలు మీకు ఎప్పుడైనా వచ్చాయా? చర్మవ్యాధి నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

Dupatta Vs Sunscreen: ఎండ నుంచి రక్షణ కల్పించడంలో సన్‌స్ర్కీన్‌కి ప్రత్యామ్నయంగా స్కార్ఫ్‌ వాడొచ్చా..?
Dupatta Can Protect Skin From Sun
Srilakshmi C
|

Updated on: Mar 26, 2026 | 1:35 PM

Share

వేసవిలో మండే ఎండ నుంచి తప్పించుకోవడానికి అమ్మాయిలు బయటకు వెళ్ళేటప్పుడు తరచుగా దుపట్టాతో ముఖాన్ని కప్పుకుంటారు. ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు. చర్మాన్ని రక్షించే ఒక కవచం. అయితే, ఇది పూర్తి రక్షణను అందిస్తుందో లేదో తెలుసుకోవాలంటే బెంగళూరులోని ఆస్టర్ ఆర్వీ హాస్పిటల్‌లో చర్మవ్యాధి నిపుణుడైన డాక్టర్ సునీల్ కుమార్ ప్రభు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

దుపట్టా చర్మాన్ని ఎలా రక్షిస్తుంది?

దుపట్టా ఒక కవచంలా పనిచేస్తూ, ముఖాన్ని సూర్యుని అతినీలలోహిత కిరణాలు, గాలిలోని దుమ్ము, కాలుష్య కారకాల నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా ఇది చర్మాన్ని ఎండకు కమిలిపోవడం, ఎండదెబ్బ తగలడం నుండి రక్షిస్తుంది.

వస్త్రం రకం చాలా ముఖ్యం

అన్ని దుపట్టాలు ఒకే స్థాయిలో రక్షణను అందించవు. వాటి రక్షణ సామర్థ్యం వస్త్ర రకాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కాటన్, నార వంటి మందపాటి, దట్టంగా నేసిన వస్త్రాలు UV కిరణాలు చొచ్చుకుపోకుండా సమర్థవంతంగా అడ్డుకుంటాయి. అయితే పలుచని, చాలా తేలికైన వస్త్రాలు సూర్యకిరణాల నుంచి తక్కువ రక్షణను అందిస్తాయి. లేత రంగు దుస్తుల కంటే ముదురు రంగు దుస్తులు ఎక్కువ UV కిరణాలను గ్రహిస్తాయి. అవి సూర్యకిరణాల నుంచి మెరుగైన రక్షణను అందిస్తాయని డాక్టర్ ప్రభు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

సన్‌స్క్రీన్ తప్పనిసరి

దుపట్టా ధరించడం అనేది కేవలం అదనపు రక్షణ మాత్రమే. దానిని సన్‌స్క్రీన్‌కు ప్రత్యామ్నాయంగా పరిగణించలేం. వస్త్రం సాగినప్పుడు లేదా చెమటతో తడిసినప్పుడు దాని రక్షణ ప్రభావం తగ్గిపోతుంది. దీంతో సూర్యరశ్మి చొచ్చుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మీ చర్మాన్ని రక్షించుకోవడానికి ఏం చేయాలి?

బయటకు వెళ్ళేటప్పుడు కనీసం SPF 30 ఉన్న సన్‌స్క్రీన్‌ను వాడాలి. ప్రతి 2 నుండి 3 గంటలకు సన్‌స్క్రీన్‌ను మళ్ళీ రాసుకోవాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండ తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో బయటకు వెళ్లక పోవడమే మంచిది. కూలింగ్ గ్లాసెస్, టోపీలు, గొడుగుల వంటి రక్షణ సాధనాలు ఉపయోగించడం ఉత్తమం.

సూర్యరశ్మి నుంచి రక్షణ ఎందుకు ముఖ్యం?

అధికంగా ఎండ తగలడం వల్ల అకాల వృద్ధాప్యం, నల్ల మచ్చలు, చర్మం రంగు మారడం, ఎండదెబ్బ, చర్మం దెబ్బతినడం వంటివి సంభవించవచ్చు. మీరు కొన్ని సాధారణ జాగ్రత్తలతో మీ చర్మాన్ని కాపాడుకోవచ్చు. ముఖాన్ని స్కార్ఫ్‌తో కప్పుకోవడం మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చక్కని మార్గం. కానీ అది ఎల్లప్పుడూ సన్‌స్క్రీన్‌కు ప్రత్యామ్నాయం కాదు. మీరు ఈ రెండింటినీ కలిపి ఉపయోగించినప్పుడు మాత్రమే మీ చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us